పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0240-3 లలిత సంపుటం: 08-237

పల్లవి:

ఏడఁజూచినా నీకు నేమి బాఁతి
ఆడానీడాఁ దిరుగఁగా నగ్గువాయ వలపు

చ. 1:

చెంగావిమోవి నీది సెలవి నవ్వులు నావి
యెంగిలి పొత్తులపతి వేమనేమయ్య
కొంగు వట్టేవేల నీవు కొనవేలు నేఁ బట్టగా
జంగిలి సతులకెల్లా చవుకాయ వలపు

చ. 2:

చెక్కుల రేకలు నీవి సిగ్గుల రాసులు నావి
యెక్కిరింత పతివైతి వేమనేమయ్య
కక్కసించేవు రతికి కడుఁదమకించే నేను
చక్కని యింతుల మీఁద జాజరాయ వలపు

చ. 3:

గుట్టుతో నలపు నీది కూడిన కాఁగిలి నాది
యిట్టి శ్రీవెంకటపతి వేమనేమయ్య
పట్టేవు నాకుచములు పయ్యద నేఁగప్పఁగాను
జట్టిగొన్న మొక్కులకు సందెఁడాయ వలపు