పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0239-5 రామక్రియ సంపుటం: 08-233

పల్లవి:

చలము రేఁగేదెల్లా సవతుల కింతేకాక
నెలకొనె నాతఁడితే నెరవేరెనే

చ. 1:

ఘాతల నందరితోడ కడు నవ్వులు నవ్వేవు
చేతికి లోనాయఁ బతి చెల్లులేవే
పోతరించి యప్పటి నిప్పుడు మారుమలసేవు
నీతితో నాతఁడుమేలు నీకె మేలే

చ. 2:

చెనకుచుఁ బగటుతో చెలరేఁగి వుందానవు
అనువాయ నీ బొగట (డ?) లౌలేవే
కనుసన్నఁ జెలులతో కమ్మర మాటాడేవు
చనవు నీకాతఁడిచ్చె జయము చేకొంటివే

చ. 3:

తావున నాకును మంచితనములు నెరుపేవు
శ్రీ వెంకటేశుఁడే బుద్దిచెప్పిలేవే
వేవేలకు రాజసాన విఱ్ఱవీఁగే వన్నిటాను
కైవసమాయ నాతఁడె ఘనురాలవౌదువే