పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0237-1 నాదరామక్రియ సంపుటం: 08-217

పల్లవి:

ఎచటనుండివచ్చితి వెదురుచూచితి నీకు
రచనమన్నించి నన్ను రవ్వగాఁజేసితివి

చ. 1:

కొండలరాయఁడ నన్నుఁ గోరి వలపంచితివి
నిండు నాతలపోఁతలు నీకె శలవు
దండి విరహము రేఁచి తడవేలసేసితివి
అండనే నాచిరుఁజెమటది నీకె శలవు

చ. 2:

కోనేటివిభుఁడ నన్ను గురుతుగానేలితివి
నేనెట్లనుండినాను నీకె శలవు
ఆనుకొని యింతేసి ఆసలనె పెట్టితివి
పూనిన పులకమోపులు నీకె శలవు

చ. 3:

శ్రీవెంకటేశుఁడ నన్ను సేసవెట్టి కూడితివి
నీవద్ద నలసినది నీకె శలవు
కైవసము చేసుకొని కందువఁ జొక్కితివి
యీవిధాల నేభోగించే దిది నీకె శలవు