పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0236-6 శుద్దవసంతం సంపుటం: 08-216

పల్లవి:

సవతి మచ్చరమున సతులదూరితి నేను
పవళించనేల నీకుఁ బంతమిచ్చేమయ్యా

చ. 1:

నిన్నునంటినట్టివారు నీయంతవారు
యెన్నియైనా నేము వెంగే లేలాడేము
చిన్నఁబోవ నీకేల చిత్తమురాకున్నఁ గన
పన్నివారిమారు నీకుఁ బంతమిచ్చేమయ్యా

చ. 2:

నీవూడిగములవారు నీకంటె ఘనులు
వేవేలకు వారినేల వేసరించేము
నీవు వాడనేలందుకు నేఁడుగావలసితేను
భావించి వారికి నీకు బంతమిచ్చేమయ్యా

చ. 3:

నీసరిభోగపువారు నీవారు మాకును
వీసమంత పనికేల వేరు సేసేము
యీసుదీర శ్రీ వెంకటేశ మమ్ముఁగూడితివి
బాసతో నీ కింతైతే పంతమిచ్చేమయ్యా