పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0204-1 సాళంగనాట సంపుటం: 08-019

పల్లవి:

మనసుకుఁ గమ్మటి నీమనసే తారుకాణ
వెనక ముందరనవి విచ్చిచెప్పరాదు

చ. 1:

సతి నీతో విన్నవించే జవ్వనపుఁగతలెల్ల
సతమై కొననాలికెఁ జదివితివి
యితరులేమీ నెఱఁగరిద్దరును నవ్వుకోఁగా
వితగాని మీపనులు వెల్లవిరులాయను

చ. 2:

సుదతి నీకునొఁగే సోబనపక్షంతలు
అదన నీవు మీఁజేతనందుకొంటివి
అదె పెండ్లి పేరటాననాపె నీవుఁ బెనఁగఁగ
పదిలపు మీగుట్టు బట్టబయలాయను

చ. 3:

కలికి సూడిదవట్టే కమలపు మొగ్గలను
వొలిసి నీవురమున నొత్తుకొంటివి
సొలసి శ్రీవేంకటేశ చూచేటి మీచూపులను
తెలిసి మీరతులెల్ల తేటతెల్లమాయను