పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0233-2 నాట సంపుటం: 08-194

పల్లవి:

ఏఁటికి దగ్గరేవయ్యా యిదేమి నీవు
మోఁటుననుందానఁ జన్ను మొనలు దాఁకీని

చ. 1:

పచ్చని చీరగట్టిన బలుదొరనంటానే
కుచ్చుల పీలిచుంగుల కొంగువట్టేవు
దిచ్చరి చెంచువారికి దేవరకు నేమిపని
ముచ్చట లాడఁగఁ జన్నుమొనలు నాఁటీని

చ. 2:

రొమ్మునఁ బూసగల వురుటు నాయఁడనంటానే
బమ్మరపోవుచు మాపై నొరగేవు
దొమ్ముల మేసువారికి దొడ్డవారి నేఁటిమాట
ముమ్మాటికి విను చన్నుమొనలు దాఁకీని

చ. 3:

వెక్కసపుకొండపై శ్రీ వెంకటేశుఁడనంటానే
కక్కసించికూడి మమ్ముఁ గాఁగిలించేవు
తక్కక మంకువారికిఁ దగు గొల్లఁడ నీపొందు
మొక్కలీఁడ నాచన్ను మొనలు దాఁకీని