పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0231-3 మధ్యమావతి సంపుటం: 08-184

పల్లవి:

ఇట్టె (నే?) సీసవెట్టి నీవు యేమరేనా నీపనులు
బట్టగుత్తలైనవారు ఫలమందుకుందురా

చ. 1:

యేలుకొన్నవాఁడవు నన్నేల దిగవిడిచేవు
చేలకొంగువట్టి యింతసేతువుగాక
బాలకివై యెంత సిగ్గుపడినాను నీకేమీ
కూలిచ్చినవారు పనిగొనక విడుతురా

చ. 2:

మాటలాడినవాఁడవు మన్నించ నేలపొయ్యేవు
వాటముగా నీ యిచ్చకకు వత్తువుగాక
నీఁటుతోడ వేడుకకు నిదించితే నీకేమి
గూంటనున్నపక్షి చేతవేఁటాడ లోఁగేరా

చ. 3:

కూడినవాఁడవు నామై గోరూఁదకేల చిక్కేవు
మేడెపురతిఁ జొక్కించి మింతువుగాక
నీడనె శ్రీ వెంకటేశ నే నలసితే నీకేమి
వాడుఁజేన వానగురిసి వరదచాలించునా