పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0231-2 ఆహిరి సంపుటం: 08-183

పల్లవి:

మానినినింతే నేను మన్నించవలదా
యేనాట నావల్ల గుణమీపాటి చాలదా

చ. 1:

తనువు నీకప్పగించి తమకాన భోగించఁగా
మనసేమి సోదించేవు మరియూనన్ను
ఘనులకు నిమ్మపండు కానుకగాఁ బెట్టితేనే
తనివొంది పదవులు తామే యొసఁగుదురు

చ. 2:

చూపులు నీపైనిలిపి సుద్దులు నేఁ జెప్పఁగాను
తీపు లేమి వెదకేవు దిష్టించి నన్ను
యేపుమీరిన దొరలు యేపాటినుతించినాను
పైపై నందుకులోనై పమ్మి కరఁగుదురు

చ. 3:

అన్నిరతులకులోనై అట్టే చొక్కించఁగాను
చన్నులేల గోరూఁదేవు సారెకు నన్ను
యిన్నిటా శ్రీవెంకటేశ యీకతలు నీచెలుల
కెన్నికతో నానతిమ్మా యిట్టే నిన్నుమెత్తురు