పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0231-2 రామక్రియ సంపుటం: 08-182

పల్లవి:

ఇంక నేమిసేయఁగల మింతకంటే రావయ్య
అంకెల మా యింటిలోని కాసపడ్డవారము

చ. 1:

అంగన లేమిటివారు ఆయము నీ చేనున్నది
సంగతెరిఁగి నడుపే సరవి నీది
వుంగిటిగాఁ గోపగింతు మొకమారు నవ్వుదుము
యెంగిలిమోవి బత్తేల నేలుకొన్నవారము

చ. 2:

పడఁతు లెంతటివారు భావము నీ నేర్పినది
విడువక భోగించే వేడుక నీది
చిడుముడి జంకింతుము చెక్కు లట్టెనొక్కుదుము
తొడసోఁకిన జీతాలదొమ్మిపౌఁజువారము

చ. 3:

వనిత లెందలివారు వలపు నీ వసముది
ననుపుగాఁగూడిన యీ నటన నీది
కొనగోరంటింతుము మొక్కుదుము శ్రీ వెంకటేశ
వొనరిన నీ రతుల వూడిగపువారము