పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0227-5 మెఁచభౌళి సంపుటం: 08-161

పల్లవి:

ఎప్పుడు నీవు వచ్చినా నేమాయను చన
విప్పించుకొనేఁగాక యేమాయను

చ. 1:

నీకు సెలవైనదాన నీచేతిలోనిదాన
యేకడ నేనే నుండినాను యేమాయను
ఆకు మడిచిచ్చేదాన ఆయాలు సోఁకినదాన
యేకొలఁది నుండినాను యేమాయను

చ. 2:

వంతువరుసల దాన వలచివుండిన దాన
యెంత విరహాన నున్నా నేమాయను
చింత నీకెక్కినదాన చిగురుఁగోరికదాన
యింత నీవు పెనఁగితే నేమాయను

చ. 3:

మనసు నమ్మినదాన మానము నీకై నదాన
యెనసి నిన్ను మెచ్చితే నేమాయను
తనిసితి నీకూటమిఁ దగు శ్రీ వేంకటేశ్వర
యినుమడించి నవ్వితేనేమాయను