పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0227-4 నాగవరాళి సంపుటం: 08-160

పల్లవి:

ఇంటికి రావయ్యా యిఁకనేఁటికి
కంటగించఁ దొల్లింటికతలెన్నిలేవు

చ. 1:

కావరించి యెట్టుండినాఁ గడు మంచివాఁడవే
నీవేమేమాడినాను నిజమరిచే
కైవసపు వనితలు కల్లలు గారులు నిన్ను
ఆవటించి వూరకైనా నాడుదురుగాని

చ. 2:

సేసేటి నీచేఁతలెల్లా చేరువపుణ్యాలే
నీ సుద్దులు విన్నవల్లా నీతితోడివే
పాసినట్టి మగువలు పట్టలేక వయసులు
వేసరి నిన్నుఁ దిట్టుతా వీఁగుదురు గాని

చ. 3:

కలసిన నీరతులు కందువ వుచితములే
సులభాన నీవు నాకుఁ జుట్టమవే
యెలమి శ్రీవెంకటేశ యెరవుల వనితలు
చలమరివని నిన్ను సాదింతురు గాని