పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0224-4 గౌళ సంపుటం: 08-142

పల్లవి:

ఏమందునే వీనిమాయ లెన్నైనాఁ గలవు
కామించి నన్నునేలె కమ్మటీ‌ని చూడరే

చ. 1:

కొప్పున రాలీ విరులు గురుతులు చూడరే
చిప్పిలీఁ జెమటలివె చేరిచూడరే
వుప్పతిల్లే పులకలనున్నాఁడు చూడరే
కప్పీఁ బడ్చడము నాకు కమ్మటీనిఁ జూడరే

చ. 2:

గందపుఁ బేఁట్లు రాలీఁ గమ్మటీనిఁ జూడరే
చిందీ లేఁతనవ్వులు సెలవులఁ జూడరే
అందమైన బుసకొట్లవి గొన్నిజూడరే
అందుకొనీ నా చన్నులంతలోనే చూడరే

చ. 3:

వాడుమోవియును వింతవాసనలఁ జూడరే
వేడుకకాఁడై వచ్చి వేఁడుకొనీఁ జూడరే
వీడెమిచ్చీఁ గోన తిరువెంగళేశుఁడై వచ్చి
కూడెను శ్రీవెంకటాద్రి కొండమీఁదఁ జూడరే