పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0223-4 లలిత సంపుటం: 08-136

పల్లవి:

నాకే కాచుకుంటివా నడుమ నీవు
యీకతలెల్లా నేర్చి యెందు వోతివే

చ. 1:

చెంతల నాతనిమాటే చెల్లఁబెట్ట వచ్చేవు
యెంత తగవరివే యేమే నీవు
పంతపురమణుఁడూర బావయై రాఁగాను
యింతేసి బుద్దులు చెప్పకెందు వోతివే

చ. 2:

కూడఁగట్టి నాలోనిగుట్లే అడిగేవు
యేడకేడ నీనేర్పులేమే నీవు
నీడనున్న రమణుని నిందలిందరాడఁగాను
యీడ నీవుత్తరాలాడకెందు వోతివే

చ. 3:

కందువనాతని నన్నుఁ గాఁగిలించఁ జేసితివి
యిందుకా నీజాణతనాలేమే నీవు
అందపు శ్రీవేంకటేశుఁ డక్కడా నిక్కడా నేఁడు
యిందెను చేసిన చేఁతలెందు వోతివే