పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0202-6 కన్నడగౌళ సంపుటం: 08-012

పల్లవి:

ఇంకా విన వేడుకయ్యీనేమంటివి
బొంకకుమీ నాతోనాపెపొందులకేమంటివి

చ. 1:

తొయ్యలి నిన్నొకమాటు తొంగి చూచెనేమంటివి
యియ్యెడకుఁ దానె వచ్చెనేమంటివి
పయ్యద జారఁగ నిల్చె భ్రమయించ నేమంటివి
అయ్యఅసాదలు వెట్టేనందుకు నేమంటివి

చ. 2:

నవ్వుతా నిన్నుమెచ్చిన నాటకానకేమంటివి
యివ్వల నీకు మొక్కితే నేమంటివి
రవ్వగానాపె వుండిన రాజసానకేమంటివి
పవ్వళించి సొలసిన పనికినేమంటివి

చ. 3:

వెలఁది నిన్నుఁ గూడితే వేడుకతోనేమంటివి
యెలమి శ్రీవేంకటేశ యింకేమంటివి
కొలఁది మీరఁగ నన్నుఁ గూడితి వింతలోలననే
తెలిసితి నీగుట్టల్లా తిరుగనేమంటివి