పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0218-5 మలహరి సంపుటం: 08-107

పల్లవి:

నీవల్లనే కదవే నీమగఁడు రతికెక్కె
ఆవటించ నీకే కలవంతలేసి బుద్దులు

చ. 1:

హితవుగల సతికి యెరపరికము లేదు
పతిమాటే తనమాటై పరగుఁగాని
సతులెందరుండినాను చంచలము దోఁచదు
అతివరో నీకే కలవంతేసి బుద్దులు

చ. 2:

యిరవెరిఁగినకాంత యెడమాటలాడించదు
సరవి మాటాడుఁ బతిముకానను
పరులవాదుకుఁ బోదు భయములేదేమిటాను
అరయ నీకే కలవంతేసి బుద్దులు

చ. 3:

నేరుపుగల మగువ నెరుసులకుఁ జొరదు
మేరమీరి రతులనే మెప్పించును
యీరీతి శ్రీవేంకటేశునిట్టే నీవు గూడితివి
ఆరితేరి నీకే కలవంతేసి బుద్దులు