పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0218-6 శ్రీరాగం సంపుటం: 08-108

పల్లవి:

ఏనాఁటికేనాడు యేమనేవు
నీ నాటకములెల్ల నీకేతెలును

చ. 1:

దగ్గరి నీగుణములు తలపోయుచుండఁగాను
కగ్గి నీతో నెరుపేటి గర్వమనేవు
సిగ్గుపడి యప్పటిని చెక్కు చేతనుండఁగాను
ఆగ్గలమై చింతించే అలుకలనేవు

చ. 2:

పొదిగి నీచేఁతలెల్ల పొగడుతానుండఁగాను
వెదకి వెదకి యాడేవెంగమనేవు
నిదురకన్నులతోడ నిన్నుఁ గొంత చూడఁగాను
గుదిగుచ్చి కుమ్మరించే కోపమనేవు

చ. 3:

కలిసి మెలసి నిన్నుఁ గాఁగిలించుకొనఁగాను
నెలి పెనఁగి బిగిసితిననేవు
బలిమి శ్రీవేంకటేశ పైకొని కూడితి నన్ను
మలసి మెచ్చితే నిన్ను మతకమనేవు