పుట:చలన చిత్ర చట్టము, 1952.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

/G-797

(iii) పై ఖండములలో దేని క్రిందన్నెనను ఆ ఫిల్మును సార్వజనిక ప్రదర్శనార్దము మంజూరు చేయుటకు పూర్వము ఆ ఫిల్ములో తాము ఆవశ్యకమని తలచునట్టి కత్తిరింపులనుగాని మార్పులను గాని చేయవలసినదిగా, దరఖాస్తుదారును ఆదేశించవచ్చును; లేక

(iv) ఆ ఫిల్మును సార్వజనిక ప్రదర్శనార్థము మంజూరు చేయకుండ నిరాకరించవచ్చును.

(2) ఈ విషయములో తన అభిప్రాయములను విన్నవించుకొనుటకు దరఖాస్తుదారుకు అవకాశమునిచ్చిన పిమ్మటనే తప్ప బోర్దు ఉపపరిచ్ఛేదములోని ఖండము (i)కి గల వినాయింపు, ఖండము (ii), ఖండము (ii ఏ), ఖండము (iii) లేక ఖండము (iv) క్రింద ఎట్టి చర్యను తీసికొనరాదు.

5. (1) ఈ చట్టము క్రింద బోర్డు తన కృత్యములను సమర్శవంతముగా నిర్వహించుటకు దానికి వీలు కలిగించుటకుగాను, కేంద్ర ప్రభుత్వము తాము సబబని తలచునట్టి ప్రాంతీయ కేంద్రములలో సలహా ప్యానళ్లను ఏర్పాటు చేయవచ్చును; అట్టి ప్రతి ప్యానలులో కేంద్ర ప్రభుత్వము నియమించుట సబబని తలచునంతమంది వ్యక్తులు ఉండవలెను. వారు ఫిల్ముల వలన ప్రజలపై పడగల ప్రభావమును నిర్ణయించుటకు అర్హతగలవారని కేంద్ర ప్రభుత్వము అభిప్రాయపడునట్టి వారై యుండవలెను.

(2) ప్రతియొక ప్రాంతీయ కేంద్రములో కేంద్ర ప్రభుత్వము నియమించుట సబబని తలచునంతమంది ప్రాంతీయ అధికారులు ఉండవలెను. మరియు ఈ విషయమున చేయు నియమములలో, ఫిల్ములను పరీక్షించుటలో ప్రాంతీయ అధికారులు పాల్గొనుట కొరకై నిబంధనలను చేయవచ్చును.

(3) ధ్రువపత్రము కొరకై దరఖాస్తు చేసిన ఏదేని ఫిల్ము విషయములో బోర్డు, ఏదేని సలహా ప్యానలును, విహితపరచినట్టి రీతిగా సంప్రదించవచ్చును.

(4) అట్టి ప్రతియొక సలహా ప్యానలు–ఈ విషయమున చేసిన నియమములలో నిబంధించినట్లు ఒక నికాయముగా వ్యవహరించుచున్నను కమిటీలుగా వ్యవహరించుచున్నను-ఫిల్మును పరీక్షించి బోర్డుకు, తాము సబబని తలచునట్టి సిఫారసులను చేయుట ఆ ప్యానలు కర్తవ్యమై యుండును.

(5) సలహా ప్యానలు సభ్యులకు ఎట్టి జీతమును పొందు హక్కు ఉండదు; కాని విహితపరచినట్టి ఫీజునుగాని, బత్తెములనుగాని వారు పొందవలెను.

5ఏ. (1) ఏదేని ఫిల్మును విహిత రీతిగా పరిశీలించిన పిమ్మటగాని లేక పరీక్షింపజేసిన పిమ్మటగాని బోర్డు–

(ఏ) ఆ ఫిల్ము, నిర్బంధనలేవియు లేకుండ సార్వజనిక ప్రదర్శనార్థము తగినదని లేక సందర్భానుసారముగ, 4వ పరిచ్ఛేదపు, ఉపపరిచ్ఛేదము (1) లోని ఖండము (1)కి గల వినాయింపులో పేర్కొనినటు వంటి పీటీవ్రాతతో నిర్బంధనలేవియు లేకుండ సార్వజనిక ప్రదర్శనార్దము తగినదని తలంచినచో, ఆ ఫిల్ము విషయములో ధ్రువపత్రము కొరకు దరఖాస్తు పెట్టుకొనిన వ్యక్తికి ఒక [1]"నిలే" 'ద్రువపత్రమును' లేక సందర్భానుసారముగ, ఒక [2]"నిలేవ" ధ్రువపత్రమును ఈయవలెను; లేక

(బీ) ఆ ఫిల్ము, నిర్భంధనలేవియు లేకుండ, సార్వజనిక ప్రదర్శనార్దము తగినది కాదని, అయితే వయోజనులకు మాత్రమే పరిమితముచేసి సార్వజనిక ప్రదర్శనార్దము తగినదని లేక సందర్భానుసారముగ ఏదేని వృత్తికి చెందిన వారికి లేక
  1. "నిర్భంధనలేని".
  2. నిర్భంధనలేని వయోజన.