పుట:చలన చిత్ర చట్టము, 1952.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

/G-796

(జీ) "ప్రాంతీయ అధికారి" అనగా 5వ పరిచ్ఛేదము క్రింద కేంద్ర ప్రభుత్వము నియమించిన ప్రాంతీయ అధికారి అని అర్దము; ఈ పదపరిధిలో అదనపు ప్రాంతీయ అధికారి, సహాయక ప్రాంతీయ అధికారి చేరియుందురు;

(హెచ్) "టిబ్యునలు" అనగా పరిచ్ఛేదము 5డీ కింద ఏర్పాటు చేసిన అపీలు టిబ్యునలు అని అర్ధము;

2ఏ. జమ్మూ-కాశ్మీరు రాజ్యములో అమలునందులేని ఏదేని శాసనమును గూర్చి లేక అస్తిత్వమునందులేని ఎవరేని [1]కృత్యకారిని గూర్చి, ఈ చట్టములో గల ఏదేని నిర్దేశమును ఆ రాజ్యము విషయములో, ఆ రాజ్యములో అమలునందున్న తత్సమానమైన, శాసనమును గూర్చి లేక అస్తిత్వమునందున్న తత్సమాన కృత్యకారిని గూర్చి చేసిన నిర్దేశమైనట్లు అన్వయించవలెను.

భాగము 2.

ఫిల్ములను సార్వజనిక ప్రదర్శనార్దము ద్రువీకరించుట.

3. (1) ఫిల్ములను సార్వజనిక ప్రదర్శనార్దము మంజూరుచేయు నిమిత్తము, కేంద్ర ప్రభుత్వము, రాజపత్రములో అధిసూచన ద్వారా, ఫిల్ము సర్టిఫికేషను బోర్దు అనబడు ఒక బోర్దును ఏర్పాటు చేయవచ్చును; ఆ బోర్దులో కేంద్ర ప్రభుత్వము నియమించినట్టి ఒక అధ్యక్షుడును, పన్నెండు మందికి తక్కువ కాకుండ, ఇరవై ఐదు మందికి మించని ఇతర సభ్యులును ఉండవలెను.

(2) బోర్దు అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వము నిర్ధారణచేయునట్టి జీతమును మరియు బత్తెములను పొందవలెను; ఇతర సభ్యులు బోర్దు సమావేశములకు హాజరగుటకు విహితపరచినట్టి బత్తెములనుగాని ఫీజును గాని పొందవలెను.

(3) బోర్దు సభ్యుల ఇతర సేవా నిబంధనలు మరియు షరతులు విహిత పరచునట్టివై ఉండును.

4. (1) ఏదేని ఫిల్మును ప్రదర్శింపగోరు ఎవరేని వ్యక్తి, దాని విషయమున ధ్రువపత్రమును పొందుటకై బోర్దుకు విహితరీతిగా దరఖాస్తు పెట్బుకొనవలెను; బోర్దు ఆ ఫిల్మును విహితరీతిగా పరీక్షించిన పిమ్మటగాని పరీక్షింపజేసిన పిమ్మటగాని–

(i) ఆ ఫిల్మును నిర్బంధనలేవియు లేకుండ సార్వజనిక ప్రదర్శనార్దము మంజూరు చేయవచ్చును;

అయితే ఆ ఫిల్ములోగల ఏదేని విషయము దృష్ట్యా, అట్టి ఫిల్మును చూచుటకు పన్నెండు సంవత్సరములలోపు వయస్సుగల ఎవరేని బిడ్డను అనుమతించ వచ్చునా అను ప్రశ్నను అట్టి బిడ్డ తల్లిదండ్రులుగాని సంరక్షకుడుగాని పర్యాలోచించవలెనని హెచ్చరించుట ఆవశ్యకమని బోర్దు అభిప్రాయపడినచో, బోర్దు అట్లని పీటీవ్రాసి ఆ ఫిల్మును నిర్బంధనలేవియు లేకుండ సార్వజనిక ప్రదర్శనార్థము మంజూరు చేయవచ్చును; లేక

(ii) వయోజనులకు మాత్రమే పరిమితముచేయుచు ఆ ఫిల్మును సార్వజనిక ప్రదర్శనార్థము మంజూరు చేయవచ్చును; లేక

(ii ఏ) ఆ ఫిల్ము స్వభావమును, అందలి విషయవస్తువును మరియు మూల స్వభావమును దృష్టియందుంచుకొని, ఆ ఫిల్మును ఏదేని వృత్తికి చెందిన వారికిగాని వ్యక్తుల వర్గమునకుగాని పరిమితముచేయుచు సార్వజనిక ప్రదర్శనార్థము మంజూరు చేయవచ్చును; లేక
  1. ఫంక్షనరీ.