పుట:చలన చిత్ర చట్టము, 1952.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చలనచిత్ర చట్టము, 1952.

(1952 లోని 37వ చట్టము)

(21 మార్చి, 1952)

చలనచిత్ర ఫిల్ములను ప్రదర్శనార్ధము ధ్రువీకరించుట కొరకును చలనచిత్రముల ప్రదర్శనలను క్రమబద్దము చేయుటకొరకును అయిన చట్టము.

పార్లమెంటుచే ఈ క్రింది విధముగా శాసనము చేయనైనది:–

భాగము 1.

ప్రారంభిక.

1. (1) ఈ చట్టమును చలనచిత్ర చట్టము, 1952 అని పేర్కొనవచ్చును.

(2) భాగములు 1.2 మరియు 4 యావద్భారతదేశమునకు విస్తరించును; భాగము 3 సంఘ రాజ్యక్షేత్రములకు మాత్రమే విస్తరించును.

(3) ఈ చట్టము, కేంద్ర ప్రభుత్వము, రాజపత్రములో అధిసూచన ద్వారా నియతము చేయునట్టి తేదీన అమలులోనికి వచ్చును:

అయితే, భాగములు 1 మరియు 2, జమ్ము-కాశ్మీరు రాజ్యములో చలనచిత్ర (సవరణ) చట్టము, 1973 ప్రారంభమైన తరువాత, కేంద్ర ప్రభుత్వము రాజపత్రములో అధిసూచన ద్వారా నియతము చేయునట్టి తేదీన మాత్రమే అమలులోనికి వచ్చును.

2. ఈ చట్టములో సందర్భమును బట్టి అర్దము వేరుగా ఉన్ననే తప్ప.–

(ఏ) "వయోజనుడు" అనగా పదునెనిమిది సంవత్సరముల వయస్సు పూర్తి, అయిన వ్యక్తి అని అర్దము;

(బీ) "బోర్దు " అనగా 3వ పరిచ్ఛేదము క్రింద కేంద్ర, ప్రభుత్వము ఏర్పాటు చేసిన [1]ఫిల్ము సర్టిఫికేషను బోర్దు అని అర్దము;

(బిబీ) "ధ్రువపత్రము" అనగా పరిచ్ఛేదము 5ఏ క్రింద జోర్దు ఇచ్చిన ధ్రువపత్రము అని అర్ధము;

(సీ) "చలనచిత్రము" అను పదపరిధిలో చలనచిత్రములనుగాని చిత్రముల పరంపరనుగాని ప్రదర్శించు ఏదేని పరికరము చేరియుండును;

(డీ) ఒక ప్రెసిడేన్సీ పట్టణమునకు సంబంధించి "జిల్లా మేజిస్ట్రేటు" అనగా పోలీసు కమీషనరు అని అర్దము;

(డీడీ) "ఫిల్ము" అనగా చలనచిత్ర ఫిల్ము అని అర్ధము;

(ఈ) "స్థలము" అను పదపరిధిలో ఇల్లు, భవనము, డేరా మరియు సముద్ర; భూ లేక వాయు మార్గమున పయనించు ఏదేని రకపు వాహనము చేరి యుండును;

(ఎఫ్) "విహిత" అనగా ఈ చట్టము క్రింద చేసిన నియమముల ద్వారా విహిత పరచిన అని అర్దము;
  1. *ఫిల్ము ధ్రువీకరణ మండలి.

/G-795