పుట:కాశీఖండము.pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

439

సప్తమాశ్వాసము


డుగా, భగపూషాదులు సదస్యులుగా, దిక్పాలకులు రక్షకులుగా, నల్లురు ధర్ముండును జంద్రుండును గశ్యపుండు సహాయులుగాఁ, గామధేనువు హవిస్సును గల్పవృక్షంబులు సమిత్కుశంబులును విశ్వకర్మ దారుపాత్రశకటమంటపాలంకారంబులును గల్పించువారుగా, ధర్మపత్ని యగు శతరూపాదేవితోఁ గూటి మహాధ్వరంబు సేయం దొడంగె నంత.

54


తే.

అరణిసంగ్రహ మొనరించి యజునిపట్టి
పెద్దకొలు వుండె ముత్యాలగద్దె యెక్కి
చుట్టు బలిసి కూర్చుండిరి సురలు మునులు
వింజ మాఁ కిడిన ట్లుండె విశ్వసభయు.

55


వ.

అప్పుడు పరమమాహేశ్వరుం డగు దధీచి యనుబ్రహ్మర్షి సభామధ్యంబున నిలిచి యెల్లవారును విన ని ట్లనియె.

56


సీ.

భారతీదేవి [1]కైవారకావ్యంబులు
        పఠియించుచున్నది ప్రస్ఫుటముగ
నాచార్యపదవికి నర్థిమై నాయితం
        బైయున్నవాఁ డుచధ్యానునుజుండు

  1. ఇచటఁ గైవారశబ్దము సంస్కృతసమాసఘటితమైయున్నది. ఇది సంస్కృతశబ్దముగూడ నని శబ్దరత్నాకరమున నున్నదిగాని యచ్ఛకర్ణాటశబ్దముగఁ గర్ణాటనిఘంటువులో నున్నది. ప్రాచీనసంస్కృతనిఘంటుగ్రంథములలో నెక్కడ నీశబ్దము గనఁబడదు. కావున నిది దేశ్యమొండెఁ గవివార(కవులకులుకులు) శబ్దతద్భవమొండెం గావలయు. ఈశబ్దము స్తుతిపరముగనే యఱవముననుఁ గన్నడమునను వాడఁబడుచున్నది. ఇట్లే శృంగారనైషధమునను 'మీకైవారదుర్భాషణం, బులకుం గాని' (ఆ-7. ప-89)యని ప్రయోగించియున్నాఁడు. శ్రీనాథుఁడు సంస్కృతశబ్దముగ భ్రమించె నని తోఁచుచున్నది.