పుట:కాశీఖండము.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

429

సప్తమాశ్వాసము


శ్వమేధ బదరీశుకశుకభవానీప్రభాస గరుడబ్రహ్మవృద్ధార్కనృసింహచైత్రరథధర్మవిశాల లలితాగౌతమీ గంగా కేశవ నర్మదా వసిష్ఠ మార్కండేయ భాగీరథీ ఖురకర్తరీదివిషత్ హయతీర్థంబు లనునివి మహాపుణ్యతీర్థంబులు.[1]

15


తే.

ఇప్పుడు చెప్పినతీర్థంబు లెన్ని గలవు
వీని నన్నిటి రాశి గావించి యందు
మూఁడుకోటులు శివలింగములను నిలిపి
రెలమి నవియు వీరేశ్వరు నెనయలేవు.

16


వీరేశ్వరాఖ్యానము

తే.

అర్థి నేతీర్థమునఁ దీర్థ మాడె నెవ్వఁ
డతని కాతీర్థమాడిన యంతఫలమె
అనఘ! వీరేశతీర్ధ మాడిననరుండు
కాంచు నిశ్శేషతీర్థావగాహఫలము.

17


తే.

కమలగంధితనూజుఁడు కలశజన్మ!
వీరుఁ డనువాఁడు హరుని (భక్తి) సేవింపఁబట్టి
యబ్బె శివునకు వీరేశుఁ డనెడునామ
మనఘ! యానందకాననాభ్యంతరమున.

18


వ.

మఱియు సంగమేశ్వరతీర్థంబు పాదోదకతీర్థంబు క్షీరాబ్ధితీర్ణంబు శంఖతీర్థంబు మఱియుఁ జక్రపద్మగరుత్మద్వైకుంఠ నారద ప్రహ్లాదాంబరీషాదిత్యకేశవ దత్తాత్రేయ భార్గవ వామన నీలగ్రీవోద్దాలక నరనారాయణ యజ్ఞవరాహ విదారణ నరసింహ లక్ష్మీనృసింహ గోపీగోవింద శేషసాంఖ్య మహిషాసురబాణ వైతరణీప్రణవపిశంగిలా పిలిప్పిలానాగే

  1. అన్నింటికిని తీర్థంబు అని చేర్పఁబడినది.