పుట:కాశీఖండము.pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

414

శ్రీకాశీఖండము


[1]నరుఁడును విరజస్కుఁ డగు ననఘ! నిమిషమునన్.

268


తే.

అనఘచారిత్ర! కాళిందియును సరస్వ
తియును నర్మదయును దదంతికమునందుఁ
గాలుదిక్కునఁ బ్రవహించుఁ గాలకూట
కంఠపాదాబ్జపీఠోపకంఠ మొరసి.

269


ఉ.

సంభృతభక్తిభావనఁ ద్రిసంధ్యములందును నాతరంగిణుల్
శంభుఁ ద్రివిష్టవేశ్వరు శశాంకకళాధరుఁ దీర్థ మార్చు వి
స్రంభమునం గరాంబురుహసంగతమంగళశాతకుంభకుం
భోంభితగంధసారసయోగసుగంధనవాంబుధారలన్.

270


క.

స్థాపించె నాస్థలంబున
నాపుణ్యతరంగిణీత్రయము చంద్రకళా
నైపథ్యంబుల భుజగక
లాపంబుల వివిధమణిశిలాలింగములన్.

271


ఉ.

నిండుమనంబుతోడ రజనీచరమౌళిఁ ద్రివిష్టపేశ్వరున్
దండనమస్కృతిప్రవణతన్ భజియించిన మర్త్యకోటికిన్
వెండియుఁ గర్మబంధములె? వెండియు నాధివికారబాధలే?
వెండియు మాతృయోనిపదవీచ్యుతి సంకటమే? ఘటోద్భవా!

272


మ.

గయ కేలా యరుగంగ మానవులకుం? గాశీపురీవాహినీ
త్రయవేణీపులినంబులందు నిడ రదా తల్లినిం దండ్రినిం
బ్రియమాతామహులం బితామహులనుం బేర్కొంచుఁ బిండానము
ల్గయికోరా ప్రమదంబుతోడఁ బితరు ల్హస్తాబ్జముల్ సాఁచుచున్?

273
  1. 'నరుఁడును విగతాఘుఁ డగును నరనిముసమునన్' అని పాఠాంతరము.