364
శ్రీకాశీఖండము
వ. | అనుటయు నమ్మునీంద్రుండు తపోబలంబునం గాని యట్టిపతి సిద్ధింపఁడు. కాశీక్షేత్రంబునఁ దపంబు సేయుము. బాల్యంబునం దపంబుఁ జేయు నీకు ధనము సిద్ధించెఁ గావున ధూతపాప యనునామంబు వహింపుమనిన, మహాప్రసాదం బని యానందకానకంబునందు ఘోరం బైనతపం బాచరించిన. | 109 |
తే. | బ్రహ్మ ప్రత్యక్ష మై వచ్చి పద్మనయన! | 110 |
వ. | అనినం గమలాసనుండు. | 111 |
తే. | ధరణిలో మూడుకో ట్లనర్థంబు లెక్క | 112 |
వ. | అని విధాత యంతర్హితుం డయ్యె. నంత నొక్కనాఁడు ధర్ముండు త న్నభిలషించి పైఁబడం దలంచిన నాధూతపాప చేయీక తలంగిన. | 113 |
తే. | జముఁడు శపియించె దానిఁ బ్రస్తరము గాఁగఁ | 114 |
వ. | చంద్రకాంతశిలారూపంబుఁ గైకొని చంద్రోదయంబున స్రవియించుచు ధూతపాప పుణ్యనది యయ్యె. ధర్ముండును ధర్మనదం బనుపేరఁ బుణ్యనదం బయ్యె. వేదశిరుండును నదీ | |