పుట:కాశీఖండము.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

319


పరతల్ దక్కిరి యాయజూక భవనప్రాగ్వంశమధ్యంబులన్
[1]వరుసం జేయరయారె వీడు నస్వధాస్వాహావషట్కారముల్.

302


ఉ.

యంత్రితభక్తిభావమున నగ్నిసమింధని సామిధేని ఋ
ఙ్మంత్రము లుచ్చరించుచు సమగ్రతరాగణిమంథనక్రియా
తంత్రము నాచరించి వసుధామరముఖ్యులు వీతిహోత్రు నా
మంత్రణ సేయ లేరయిరి మచ్చరికించియుఁ గాశికాపురిన్.

303


వ.

ఆసమయంబున.

304


ఉ.

భూపతిసమ్ముఖంబునకుఁ బోయి కరాంబుజము ల్మొగిడ్చి వి
జ్ఞాపన సేసె నారసికసంఘము మెల్లన గొంకి కొంకి యి
ష్టాపకరోక్తిఁ జెప్పెడునెడం [2]గడునల్గుట నీతి యౌ ననం
బాపలు మేదినీశ్వరులమానసముల్ దిరిసెంపుఁబూవులున్.

305


తే.

అవధరింపుము నీప్రతాపాతిశయము
గరిమమున నోహటించియో కాని వహ్ని
కాశికాపట్టణము నైదుక్రోశములును
బదిల మై యుండ నోపక పాఱిపోయె.

306


ఉ.

అంబుజబాంధవాన్వయనృపాగ్రణి! బోనము నేఁడు సూర్యపా
కంబున నాయితం బయినఖజ్యము భోజనశాలలోనఁ బ
ళ్యం బిడినారు పంకజదళాక్షులు రెండవజాముగంట వే(మ్రో)
యంబడె నారగింప సమయం బని యిమ్మెయి విన్నవించినన్.

307
  1. 'వరిబియ్యం బెడ యొల్కి వీడును; వరు జయ్యెం బెద యొల్కి'
    అనియుఁ గొన్నిప్రతులతోఁ గనఁబడుచున్నవి. ఈ పాఠములు చింత్యములు.
  2. 'గడునజ్ఞులనీతియోపనం, బ్రాపలు' అని ముద్రితపుస్తకపాఠము. ఈ రెండు పాఠములు జింత్యములు.