పుట:కాశీఖండము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పీఠిక 

3

    సంతరించితి నిండుజవ్వనంబునను శ్రీ
హర్షనైషధకావ్య మంధ్రభాషఁ
    బ్రౌఢనిర్భరవయఃపరిపాకమునఁ గొని
యాడితి భీమనాయకునిమహిమఁ
తే. బ్రాయ మెంతయు మిగులఁ గైవ్రాలకుండఁ
    గాశికాఖండమను మహాగ్రంధ మేను
    దెనుఁగుఁ జేసెదఁ గర్ణాటదేశకటక
   పద్మవనహేళి శ్రీనాథభట్టసుకవి. 7

ఉ. స్కందపురాణసంహితకు ఖండము లేఁబది యందులోన నా
    నందవనానుభావకథనంబున శ్రోతకు వక్తకున్ శుభా
    నందపరంపరావహము నైజగుణం బని గాశిఖండ మా
    కందు వెఱింగి నేను సమకట్టితిఁ గావ్యముగా నొనర్పఁగాన్. 8

వ. ఇమ్మహాప్రబంధప్రారంభంబుఁ గర్ణాకర్ణికావశంబున నాకర్ణించి కర్ణాంతవిశ్రాంతవిశాలనేత్రుండును,
    బంటవంశకమలమిత్త్రుండును, నశ్రాంతవిశ్రాణనక్రీడాపరాయణుండును, వీరనారాయణుండును,
    నిత్యసత్యుండును, బల్లవాదిత్యుండును, భూభువనభారభరణదీక్షాదక్షదక్షిణభుజాభుజంగుండును,
    రాయవేశ్యాభుజంగుండును, గీర్తిగంగాతరంగిణీప్రవాహపవిత్రితస్వర్గమర్త్యపాతాళుండును,
    జగదగోపాలుండును, విమలధర్మశీలుండును, సంగడిరక్షాపాలుండును నగు
    నల్లయవీరభద్రభూపాలుం డొక్కనాఁడు. 9

సీ. త్రైలోక్యవిజయాభిధం బైన సౌధంబు
చంద్రశాలాప్రదేశంబునందు