పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వామిత్రుడు పుట్టుట కనేకలక్షల సంవత్సరములకు పూర్వమే భారతవర్ష మంతయు ఆర్యజాతీయులతో నిండిపోయినది. భారతవర్షములోని ప్రతిరాష్ట్రమును చాతుర్వర్ణ్యస్థులైన ఆర్యులకును, వారిలోని అనులోమ విలోమాది శాఖలకును నివాసభూమియై యున్నది. అందు ఇప్పు డాంధ్రదేశ మని పిలువబడుచుండిన భాగము బహుజనాకీర్ణమైన "ప్రాచ్యక" రాజ్యములో చేరియున్నది. విశ్వామిత్రునికి పూర్వము ప్రాచ్యక దేశములో చేరియుండిన భాగమే 'ఆంధ్రరాజు'చే ఆంధ్ర దేశమను పేర పిలువబడినది. అది బహుజనాకీర్ణమై యుండిన భాగముకాని కేవలము అరణ్యప్రదేశము కాదు. అది యొక శక్తిమంతుడైన రాజుయొక్క రాజ్యమైయున్నది. అం దితరులు వచ్చి యాక్రమించుట కేనాడును అవకాశము లేదు. ఇట్టి స్థితిలో బాహ్యజాతీయులయిన "అంధ్ర" జాతీయులు వచ్చి ఆక్రమించుకొని రను వాదము కేవలము భారతదేశ చరిత్రను సాంప్రదాయము నెఱుగనివారిచే చేయబడిన దుర్వాదమై యున్నది.

ఆంధ్రోత్పత్తిని గుఱించిన అవివాద నిరాసము

విశ్వామిత్రునిచే శునశ్శేఫుడు కారణముగా శపింపబడి బాహ్య జాతులుగా మారిపోయిన విశ్వామిత్రుని జ్యేష్ఠపుత్రులు ఏబదిమందియు "అంధ్రు"లై రనియు, వారు పుళింద, పుండ్ర, శబర, ముతిబా, మొదలగు జాతులతో కలిపి ఐత రేయ బ్రాహ్మణములో చెప్పబడి రనియు, శునశ్శేఫుని చరిత్ర ఐత రేయ బ్రాహ్మణముకంటె అతి పురాతన మైన దనియు కాబట్టి ఐత రేయ బ్రాహ్మణములలో చెప్పబడిన 'అంధ్ర'లు ఐత రేయ బ్రాహ్మణముకంటె అతిపురాతను లని చెప్పి రనియు, మూలపురుషుని పేర జాతులు పిలువబడుట భారతీయ సాంప్రదాయమున అతి ప్రాచీన కాలమున గల దనియు, అందువలన ఇప్పు డాంధ్రదేశమున గల "ఆంధ్రులు" విశ్వామిత్రుని జ్యేష్ఠపుత్రులలో జ్యేష్ఠుడైన 'అంధ్ర' అను పేరుగలవాని సంతానము కావచ్చు ననియు సందేహించుచు పాశ్చాత్యులచే కల్పించి వ్రాయబడిన తప్పుకథలను నమ్మి వారిచే వ్రాయబడిన