పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తప్పుచరిత్రలను భారతీయులలో కొందరు తమతమ దేశభాషలలో ప్రచారముచేయుచుండిరి. (1-10-53 తేదీగల ఇంగ్లీషు 'హిందూ'పత్రిక, 20, 29, పుటలలో ఆంధ్రులను గురించిన వ్యాసమును చూడుడు.)

ఐతరేయ బ్రాహ్మణములో చెప్పబడిన "అంధ్రులు" ఐతరేయ బ్రాహ్మణముకంటె అతిప్రాచీనులు. ఐతరేయ బ్రాహ్మణము 'అంధ్ర' ల కంటె అతి ప్రాచీనము.

ఈ రహస్యము తెలిసినచో ఈ సందేహమునకు గాని ఇట్టి వికల్పమునకు గాని తావుండదు.

శ్రుతి: "యధోర్ణనాభి: సృజతే గృహ్ణతే చ
           యథా పృథివ్యా మోషధయ స్సంభవన్తి
           యథా సత: పురుషాత్ కేశలోమాని
           తథాక్షరా త్సంభవతీహ విశ్వం."

         "ధాతా యథాపూర్వ మకల్పయత్."

అను శ్రుతివాక్యములను బట్టి ప్రకృతినుండి ఈ సృష్టి స్వాభావికముగనే బహిర్గత మగుచు కొంతకాలముండి పిమ్మట ప్రకృతియందు లీనమగుచు తిరిగి బహిర్గత మగుచుండును. ఈవిధముగా సృష్టిస్థితి లయములు వాటి యంతట నవి తిరిగితిరిగి బహిర్గత మగుచు తిరోహిత మగుచుండును. అట్లు బహిర్గత మగుటలో వెనుకటి సృష్టివలెనే ఈనాటి సృష్టియు బహిర్గత మగుచుండును. అట్లు మాటిమాటికిని వచ్చుచు పోవుచుండు సృష్టి, వసంతాది ఋతుధర్మములు గత ఋతుకాలములయందు బహిర్గత మైనటులనే వర్తమాన కాలమునను గోచరించుచుండును. దానినిబట్టి భవిష్యత్కాలమున గూడ ఇదేవిధమున వసంతాది ఋటుకాలములు తమ తమ ధర్మముల నెరవేర్చుచుండు నని మనము నిష్కర్షగా చెప్పుట కవకాశము కలదు. అదేవిధమున ఈ సృష్టిస్థితిలయములు చక్రాకారముగ వచ్చుచు పోవుచు తిరిగితిరిగి వచ్చుచు పోవుచుండును. ఒక చక్రములో ఏదియో యొక సూక్ష్మబిందువునుండి మనము గమనింప ప్రారంభించి