పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని శ్రుతి స్మృతి పురాణేతిహాసము లన్నియు వేనోళ్ల చాటుచున్నవి. భారతీయార్యుడే ప్రపంచములోని సమస్త జాతులకును మూల పురుషుడు. అతడే స్వాయంభువ మనువు. మనువు సంతానమైనందున వారు "మానవులు" అని పిలువబడిరి.

విశ్వామిత్రుని - ఆతనికుమారుల - గాధ

ఆర్యులు బ్రహ్మావర్త దేశమునం దుత్పత్తిని పొంది దేశమంతట వ్యాపించి నివసించి యుండినపిమ్మట చాలకాలము గడువగా వైవస్వత మన్వంతరములోని 24 వ మహాయుగమున కృతయుగపు ప్రమాణమగు 17, 28, 000 సంవత్సరములును త్రేతాయుగప్రమాణమగు 12, 96, 000 సంవత్సరములును గడచుచుండిన త్రేతాయుగాంత కాలమున విశ్వామిత్రు డనెడి రాజు ఉండెను. ఈతని తండ్రి పేరు గాధి. ఈత డొక రాష్ట్రమునకు ప్రభువు. విశ్వామిత్రుడు తండ్రినుండి సంక్రమించిన రాజ్యమును చిరకాలము పరిపాలించిన పిమ్మట కారణాంతరములచే రాజ్యమును త్యజించి అరణ్యమున నుండి నియమస్థుడై చిరకాలము తప మొనర్చి బ్రహ్మర్షి యయ్యెను. ఆ మహర్షి యొక్క ఆశ్రమము సరస్వతీ నదికి పశ్చిమ తీరమున కలదు. ఆయనకు నూరుమంది కుమారు లుండిరి. ఆ విశ్వామిత్ర మహర్షి పండితుడును, తపోధనుడును మంత్రద్రష్టయునగు శునశ్శేపుడను పేరుగల యొకబాలుని వెంట గొనివచ్చి తన కుమారుల నందరను పిలిచి ఇట్లనియె:-

"కుమారులారా! ఈ కుమారుడు మిమ్ముల నందఱను మించిన ప్రతిభాశాలి. వీనిని నేను కుమారునిగా స్వీకరించి యుంటిని. కావున వీనిని మీ కందరకు జ్యేష్ఠునిగా చేసికొని వానిపేరున ఇకనుండియు మీరు శునశ్శేఫ సోదరులను నామమున గాని లేక ఈతని పేరును మార్చి నే నీతనిని "దేవరాతుడ"ని పిలుచుచుంటిని గనుక మీరందరును "దేవరాత సోదరుల"ని కాని పిలువబడ వలయును. ఈతని ఆజ్ఞలకు మీరు బద్ధులై యుండవలెను." కాని విశ్వామిత్రునికుమారులు నూఱు