పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హోత్రమున హవిస్సులను వేల్పించి వారిని దేశములో నాల్గుభాగములకు రాజులనుగా చేసియుండిరి. (ఇందునుగురించిన వివరములకు నాచే రచింపబడిన 'అగ్ని వంశపు రాజులు' అనెడి గ్రంథమును చూడుడు).

ఈవిధముగా ఆంధ్ర శాతవాహన వంశము అనేక విభాగములై భారతదేశము నంతను పరిపాలించి యున్నది. క్రీ. శ. పండ్రెండవ శతాబ్దములో కల్హణపండితునిచే వ్రాయబడిన రాజతరంగిణి గ్రంథములో ఆంధ్రశాతవాహన వంశజులు కాశ్మీరులోను, లాహోరులోను అభిసార, ఉరగ, సింహపుర, దివ్యకటక, ఉత్తరజ్యోతిష (చివరి మూడును ఇప్పుడు ఆప్ఘనిస్థానములో అంతర్భూతమైనవి. మొదటివి ఇప్పటి కాశ్మీరులో చేరిపోయినవి.) అను క్షత్రియ యవనరాష్ట్రములలోన క్రీ. శ. ఎనిమిదవ శతాబ్దమునుండి పరిపాలించుచున్నటుల వ్రాసి యున్నాడు. లోహారువంశము, హిందూసాహివంశము (వీరు తోమర వంశీయులు) ఆంధ్రశాతవాహనులనుండియు, రాజపుత్రులనుండి ఏర్పడిన తోమరవంశము నుండియు ఏర్పడినవైయున్నవి. ప్రమర వంశము పరమార వంశము లేక పాన్వారు వంశము అని ప్రసిద్ధికెక్కిన, ఈవంశములోనే విక్రమాదిత్య శాలివాహన భీజరాజు లుద్భవించిరి. చపహానివంశమువారు చాహుమాన్‌లని పిలువబడిరి. అందు చపహాని కుమారులలో (వీరు తోమర వంశమువారలు) కేవలము క్షత్రియాచారముల నవలంబించి క్షత్రియులుగానే పరిగణింపబడి రని "తోమన క్షత్రియా: స్మృతా:" అని పురాణమే చెప్పుచున్నది. ఈవంశములో పృథ్వీరాజు, జయచంద్రుడు, రాణీసంయుక్త మొదలగు మహామహులుద్భవించిరి. శుక్లవంశము చాళుక్య వంశమనుపేరున ప్రసిద్ధి కెక్కినది. ఈ రాజులు దక్షిణాపథమున రాజ్యములు చేసియుండిరి.

అందు తూర్పుచాళుక్యులు తూర్పురాజ్యములను, పశ్చిమ చాళుక్యులు పశ్చిమ సముద్రతీర రాజ్యములను పరిపాలించి ప్రసిద్ధి కెక్కిన మహాభారతమును తెలుగున వ్రాయించిన రాజరాజ నరేంద్రుడు చాళుక్యవంశములోనివాడు. క్రీస్తుశకమున కిటీవలి శతాబ్దులనుండి యీ చాళుక్యరాజులు క్షత్రియులుగా పిలువబడుటయే గౌరవముగా నెంచి