పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తమ వంశములను ప్రాచీన క్షత్రియ మూలపురుషులతో కలుపుకొని వంశవృక్షములను వ్రాయించుకొని శాసనములలో తాము క్షత్రియుల మని వ్రాయించుకొనిరి. పరిహార వంశీయులు బెంగాలుదేశమున రాజ్యములు చేసిరి. బంగాళా దేశములోని శాక్తేయ బ్రాహ్మణు లీశాఖకు చెందినవారు.

కదంబ వంశపు రాజులు - ఆంధ్రులు

ఆంధ్ర శాతవాహన వంశమునుండి యేర్పడిన కదంబ రాజవంశమునకు మూలపురుషుడైన "మయూరశర్మ" మళయాళ (కేరళదేశము) దేశమునకు క్రీ. పూ. ఆఱవ శతాబ్దములో రాజయ్యెను. ఈతని వంశములో 'కాకుత్థ్సవర్మ' యను రాజు క్రీ. శ. 550 సంవత్సరములో రాజ్యము చేయుచుండెను. (Ancient Dekkan P.27).

ఆకాలమున మళయాళ దేశమున బ్రాహ్మణులు లేకుండుటవలన 'మయూర శర్మ' తన జన్మదేశమైన గోదావరి మండలములోని "అహి క్షేత్రము" (అనగా సర్పవర మనెడి గ్రామము) నుండి బ్రాహ్మణ కుటుంబములను తీసికొనివెళ్లి మళయాళ దేశమున నెలకొల్పెను.

"దక్షిణఇండియా వర్ణములు, తెగలు" అను గ్రంధము 7 సంపుటములుగా మద్రాసు దొరతనమువారిచే ప్రచురింపబడినది. అందు మళయాళ (కేరళ) దేశబ్రాహ్మణులను గురించి యిట్లు చెప్పబడినది:-

"బ్రాహ్మణులయొక్క లిఖితములైన కొన్ని గ్రంథములలో కదంబవంశజుడైన మయూరశర్మ కాలమున ఆంధ్రబ్రాహ్మణులు కొందఱు దక్షిణ కన్నడమునకు తీసుకొని పోబడిరని చెప్పబడియున్నది. పరశురాముని శాపానంతరము కదంబవంశములోని మయూరశర్మ అహిక్షేత్రము నుండి బ్రాహ్మణులను తీసికొని వచ్చువఱకును ఆదేశమునందు బ్రాహ్మణులు లేరు. ఉత్తర కన్నడములోని 'బనవాసి' రాజధానిగా రాజ్యముచేసిన కదంబవంశమునకు మూలపురుషుడు "మయూర వర్మ" యని శాసనములు చెప్పుచున్నవి. (మయూర శర్మ, మయూరవర్మ యని