పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పైన చూపబడిన జాబితాదాఖలా ఆంధ్ర శాతవాహన చక్రవర్తులు ముప్పదియుద్దరు కలి 2269 సంవత్సరము లేక క్రీ. పూ. 833 లగాయతు కలి 2775 లేక క్రీ. పూ. 327 సంవత్సరము వరకు (506 సం.) అయిదువందల ఆఱుసంవత్సరములు రాజ్యము చేసియుండిరి. వీరికి పిమ్మట ఆంధ్రభృత్యులనబడు "గుప్తవంశము" మొదటిరాజు 'గుప్త చంద్రగుప్తుడు' చివరి ఆంధ్రరాజులగు చంద్రశ్రీ, పులోముల సంహరించి క్రీ. పూ. 327 సం. లో రాజ్యమునకు వచ్చియుండెను. అలెగ్జాండరు దండయాత్రాకాలమున మగధరాజ్య భాగమును కలుపుకొని పాటలీపుత్రమున, పట్టాభిషేక మొనర్చుకొని పరిపాలించినవాడు గుప్తచంద్రగుప్తుడుగాని చంద్రగుప్తమౌర్యుడు కాడు. ఈవిధముగ తప్పుగ గుర్తించినటుల నటించి పాశ్చాత్య చరిత్రకారులు భారతదేశచరిత్రములో క్రీ. పూ. 3138 సం. లో జరిగిన భారతయుద్ధమున కిటీవల క్రీ. పూ. 1534 సం. లో గావింపబడిన చంద్రగుప్తమౌర్యుని పట్టాభిషేక కాలమును క్రీ. పూ. 322 సం. లో జరిగినటుల కల్పించి భారతదేశచరిత్ర కాలములో క్రీ. పూ. 1534-322 = 1212 సం. లు తగ్గించిరి. ఈవిషయములో పాశ్చాత్యులచే వ్రాయబడిన వివరములన్నియు మాచే ప్రకటింపబడిన " The plot in Indian Chronology" అను ఇంగ్లీషు గ్రంథములో చూడగలరు. క్రీ. పూ. 327 సంవత్సరములో ఆంధ్రుల సామ్రాజాధిపత్య మంతరించినది. కాని ఆంధ్ర శాతవాహన రాజవంశము లంతరింపలేదు. ఆంధ్ర రాజవంశము లంత:కలహముల కాలవాలమై సామ్రాజ్యమును ముక్కలుగా చేసి పంచుకొని ఎవరికి వారు స్వతంత్రులై అందరును అల్ప రాజ్యములను పరిపాలించెడి రాజులైరి. ఈవిధముగా ఆంధ్రరాజవంశము 12 విభాగములైనటుల పురాణములు చెప్పుచున్నవి.


"ఆంధ్రాణాం సంస్థితా: పంచ తేషాం వంశాశ్చ యే పున:, సప్తైవ తు భవిష్యంతి


బ్రహ్మాండపురాణము 77 అధ్యాయము 171 వశ్లోకము.

(వాయువుపురాణము 99-358)