పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసమున యజ్ఞాశ్వముతో వెళ్ళిన అర్జునుడు దక్షిణ సముద్ర తీరంబున గల ద్రవిడ, ఆంధ్ర, రౌద్ర, మాహిషక, కేరళ కర్ణాట దేశాధీశులను జయించి యజ్ఞాశ్వమును తోలుకొని పోయినట్లు గలదు. ఉషాకన్య స్వప్నమందు గనిన పురుషుని గుర్తించుకొఱకు ఆమెచెలికత్తె వ్రాసి చూపిన రూపపటములలో ఆంధ్రరాజుకూడ గలడని చెప్పబడెను. ఈవిధముగా శ్రీమద్రామాయణ చరిత్ర జరుగుటకు పూర్వము దశరథుని కాలముననే 'ప్రాచ్యక' దేశభాగమైన యీదేశమునకు "ఆంధ్రదేశ" మను పేరు వచ్చినట్లు స్పష్టమైన చరిత్ర గలిగియుండగా మన ఊహలతో కల్పింపబడిన గాథల కెట్టి విలువయు గలుగబోదని వేఱుగా చెప్ప నక్కరలేదు.

ఆంధ్రరాజుయొక్క దరిమిలా వంశపరంపర మనకు దొరకుట లేదు. అది త్రేతాయుగములోని చరిత్ర. ద్వాపరయుగాంతమున జరిగిన మహాభారత యుద్ధములో ఆంధ్రుల ప్రశంస వచ్చినట్లు కనబడదు. వీరుభయపక్షములలో నే పక్షమునకును సాయపడి యుద్ధము చేసినట్లు కనుబడదు. కాశ్మీరరాజు పసిబాలుడగా నుండుటవలన కాశ్మీర సైన్యములు భారతయుద్ధమున పాల్గొనియుండలేదని కల్హణపండితుడు తన రాజతరంగిణియందు వ్రాసియున్నాడు. భారతయుద్ధవర్ణనమునం దెచ్చటను కాశ్మీరసైన్యములు పాల్గొనినట్లు చెప్పబడి యుండలేదు. అటులనే నాటి ఆంధ్రరాజు ఏపక్షమునకు చేరక తటస్థుడుగా నుండి యుండుటవలన ఆంధ్రరాజుగాని, సైన్యములుగాని భారతయుద్ధవర్ణనమున గానిపించుట లేదు. కొందఱు ఆంధ్రసైన్యములు భారతయుద్ధములో కౌరవపక్షమున చేరి పాండవులతో యుద్ధము చేసినట్లు మాతో వాదించి యుండిరి గాని వారు భారతములోని వాక్యముల నుదాహరించలేక పోయిరి. ఆంధ్రసైన్యములు భారతయుద్ధములో పాల్గొనినట్లు తెలుపు వాక్యములు భారతమున చూపిన వారికి కృతజ్ఞులుగా నుందుము. అంతవరకును భారతయుద్ధములో పాల్గొనక తటస్థులుగా నుండినటుల ఒప్పుకొనక తప్పుటలేదు. భారతయుద్ధము కలిశక