పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మనిషి.


కనుమరుగైన పాటల మాంత్రికుడు


ఆయన తన పాటలతో అందరినీ వులకింవజేశాడు. పండితులనూ, పామరులనూ అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. కనుకనే ఆయనను పాటల మాంత్రికుడని మనం చెప్పుకోవచ్చు.

సంగీతాన్ని ఒక శాస్త్రంగా ఏ గురువు వద్దా నేర్చుకోలేదని ఆయనే ఎన్నోసార్లు చెప్పారు. కాని, కొద్దిపాటి సాధనతోనే ఆయన శాస్త్రీయ సంగీతబద్ధమైన పాటలనూ గొప్పగా పాడారు. సినిమా పాటలే గదా అని కొట్టిపారవేయడానికి వీలులేని వేలాది పాటల్ని ఆయన వినివించాడు. హాస్యపాత్రలకూ, కథానాయకులకూ విల్లలకూ, కుర్రకారులకూ మునలివారికీ అన్ని రకాల వేషధారులకూ ఆయన పాడిన పాటలు సరిగ్గా సరిపోయాయి. ఎవరుపాడినా ఘంటసాలగారి తర్వాతే అని ఆరోజుల్లో సినీ సంగీత (వ్రియులనుకొనేవారు. వారి మాటల్నీ వమ్ముచేశాడు పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఒక్క తెలుగులోనే కాదు, తమిళం, కన్నడం, పాందీ, ఒరియా, భోజ్‌పురి, కొంకణితో సహా ఎన్నో భాషల్లో పాటలు పాడి అంతగా పేరు తెచ్చుకొన్నాడు. ఆయా భాషల్లో ప్రసిద్ధిగాంచిన గాయకుల అభినందనలనూ పొందాడాయన. నాలుగు దశాబ్దాలకుమించి సినీరంగాన్ని ఏలినా, తన తర్వాతి తరాన్నీ ప్రోత్సహించాలనే ఆలోచనతో ఎవరూ ఊహించని రీతిలో 'పాడుతా తీయగా” వంటి అద్భుత ప్రయోగాన్ని చేశాడు. అ యోచనా యోజనా రామోజీరావుగారిదో, ఎస్పీగారిదో తెలియదు గాని; ఇద్దరూ కలిసి గొప్ప ప్రయోగాన్ని చేశారు. బాగా పాడాలనే ఉత్సాహమున్న పిల్లల్ని యువతనూ చేరదీసి పాడించారు. వారిలోంచి ఎందరో గాయకులు దూసుకొచ్చారు. వారితో పాటు ఆ కార్యక్రమానికి నంబంధంలేని పాటగాళళ్లూ కొందరు తమంతటతావే. ముందుకొచ్చారు. అందర్నీ ఆయన ప్రోత్సపాంచాడు. ఇవ్వుడు వారే తెలుగు సినీరంగంలో కుదురుకొన్నారు. సినిమా పాటల కచేరీల్లో, టీవి కార్యక్రమాల్లో అలరిస్తున్నారు.

పాటనే కాదు, 'మాటిను కూడా తనకు కావలసిన స్వరంలో స్థాయిలో తీర్చిదిద్దుకోగలిగాడు. ఎందరో నటులకు డబ్బింగ్‌ సినిమాల్లో తన గొంతునిచ్చాడు. మరెవ్వరూ సాటిరాలేనంతగా పాటకూ, మాటకూ తనదైన ముద్రను వేశాడు.

ఆయన కేవలం గాయకుడే కాదు, చక్కని నటుడు కూడా. చాలా సినిమాల్లో తనకనువైన పాత్రల్లో నటించాడు. “మిథునం సినిమాతో ఆయన బహుశా తానే ఊహించనంత కీర్తినందుకొన్నాడు.

సాధారణ స్థాయి నుండి ఎదిగి, సరస్వతితో పాటు లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకొన్నాడు. తన జీవితాన్ని అత్యున్నతంగా మలచుకొన్నాడు. తానున్నరంగంలో ఎందరో ఆత్మీయులను పొందగలిగాడు. ఆయన మరణానికి వారే కాదు, కోట్లాది అభిమానులు విలపించారు.

ఆయన అన్ని భాషలనూ ప్రేమించాడు తన అమ్మనుడి తెలుగును ప్రాణప్రదంగా భావించాడు. తొలినుంచీ చెన్నైతోనే తన బంధం పెంచుకొన్నాడు. అక్కడే సెప్టెంబరు 25న కన్నుమూశాడు.

తెలుగును కాపాడుకోవాలని ఎక్కడ వీలున్నా చెప్పేవాడు. తెలుగు గొప్పదనాన్ని ముఖ్యంగా తెలుగు సాహిత్యాన్ని గురించి వీలున్నచోటల్లా పొగిడేవాడు. అయితే తెలుగు ఉద్యమాలలో ఆయనెన్నడూ భాగం కాలేదు. 'పాడుతా తీయగా” వంటి వేదికల ద్వారా తనదైన శైలిలో ఆ పనినీ చేశాడు.

75 ఏళ్ల ప్రాయంలోనూ ఆయన గొంతు, ఆయన ఆరోగ్యం ఎన్నాడూ ఆందోళనకు తావివ్వలేదు. ఆయన బహుశా రెండు జీవితకాలాల (శ్రమను చేశాడు. తన ఊపిరితిత్తులను అంతగా వాడేసుకొన్నాడేమో, 'కరోనా' దెబ్బను తట్టుకోలేకపోయాడు. తాను క్షేమంగా బయటవడగలననీ, గానసాగరంలో ఇంకా ఈదులాడగలననే ఆశతో చివరివరకూ ఉన్నాడు. తనకు తానే చెరిగిపోని చరిత్రను నిర్మించుకొన్న మహావ్యక్తి ఆశల్సిి విధి ఇలా తారుమారు చేసింది. తెలుగు ప్రజల సంపదను కూలదోసింది. మరొక బాలనుబ్రవ్మాణ్యం తొలుగుజాతిలోంచి ఎదగడని భావించనక్కరలేదు. నిరంతర కృషితో ఎంతకైనా ఎదగవచ్చనే ఆయన జీవిత సందేశాన్ని అందిపుచ్చుకోగల శక్తిమంతులైన యువత కోసం ఎదురుచూద్దాం. - సంపాదకుడు | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |