పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సి.వి. క్రిష్టయ్య

93965 14554

బ్రతుకుతెరువు కోసం తెలుగు భాష

నేనొక వల్లెటూరు హైస్కూల్లో పనిచేస్తున్నాను. సిటీ నుండి ఈ ఊరికి బస్‌ సౌకర్యం ఉంది. గంటలోపు ప్రయాణం. పిల్లలు కాలేజి చదువులకు వచ్చినందువల్ల, ప్రయాణ సౌలభ్యం వల్లా సిటీలో సంసారం పెట్టాను.

సిటీ ఐస్‌ కోసం ప్రతి రోజు ఒక బజారు సెంటర్లో నిలబడి ఎదురుచూసేవాడిని. ఆ సెంటర్లో అనేక షాపులతో పాటు ఒక యస్‌.టి.డి. టెలిఫోను బూతు, ఒక ఫోటోస్టుడియో కూడా ఉన్నాయి. ఈ రెండింటిలో వని చేన్తున్న ఇద్దరు యువకులు నాకు పరిచమయ్యారు. వారు చాలా తక్కువ జీతానికి పనిచేస్తున్నారు. వేరే ఎక్కడైనా కొత్త పని కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు.

నేను బన్‌ వచ్చే వరకు యస్‌టిడి బూతులో కూర్చుని అక్కడ పనిచేస్తున్న ప్రసాదుతో పిచ్చాపాటి మాట్లడతూ ఉండేవాడిని. ఒక రోజు ఉన్నట్లుండి ప్రసాదు “సార్‌ ఇంతకూ మీరు ఏమిచేస్తుంటారు? అని అడిగాడు.

“పిల్లలకు అక్షరాలు నేర్పుతుంటాను” అని బాధగా చెప్పాను.

మీరు ఎలిమెంటరీ స్కూలు టీచరా?

“కాదు, హైస్కూల్లో సీనియర్‌ తెలుగు పండితుడిని”.

అయితే అక్షరాలు నేర్చదం ఏమిటి?

“ఏమి చేయమంటావు? పదో తరగతికి వచ్చినా చదవడం రాయడం రాదు. ఏంరాదో అదేకదా నేర్పాలి” అన్నాను విసుగ్గా.

ఈ మాటలు విన్న ప్రసాదు, నారెండు చేతులు గట్టిగా పట్టుకొన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. “సార్‌ నా పరిస్థితి గూడా ఇదే. నేను పదోతరగతి వరకు కాన్వెంట్‌లో ఇంగ్లీషు మీడియంలో చదివాను. నాకు ఇంగ్లీషూ రాదు. తెలుగూ రాదు. అయితే తెలుగు కొంచెం మెరుగు. మనం మాట్లాడే భాషేగదా! కాని సరిగ్గా రాయలేను. తప్పులుపోతాయి. మా అమ్మ ఉదయం సాయంకాలం చిన్న టిఫెన్‌ సెంటర్‌నడుపుతూ ఉంది. నేను రాత్రి ఇంటికి వెళ్లగానే శేపటికికానలసిన సామాను ఏది ఎంతకావాలో చెప్పి దబ్బులిస్తుంది. నేను ఆ సామాను పేర్లలో మొదటి అక్షరాలు ఒక చీటీ మీద రాసుకొంటాను గుర్తుకోసం. ఆ చీటీని తీసుకొని కొట్టుకు వెళతాను. చీటీ చూసి ఏది ఎంత కావాలో రాసుకొమ్మని కొట్టువాడికి చెబుతాను. అతను నా చేతులోని చీటి ఇమ్మంటాడు. దాన్ని ఎలా ఇచ్చేది? అసలు సంగతి ఏమిటంటే ఆషాపువాడు నాబాపతే. ఈ మధ్య నాకు ఒక ఎలక్ట్రిక్‌ షాపులో ఉద్యోగం ఇస్తామన్నారు. లెక్కలు రాసే పని. రాదన్నాను. నేర్చుకొని రమ్మన్నారు. ఎలాగా అని అలోచిస్తున్నాను. దేవుడిలా మీరు దొరికారు. ఎలాగైనా మీరు నాకు నేర్పాలి. ఉండండి శంకర్‌ని కూడా పిల్చుకొని వస్తాను. అంటూ ఫోటో స్టూడియోకెళ్లి శంకర్‌ను పిల్చుకొని వచ్చాడు.

“సార్‌ ఎంతడబ్బు అయినా ఇచ్చుకుంటాం. మీరు మాకు చదువు నేర్పాలి అంటూ ప్రాధేయపడ్దారు. ఇంతకూ మీరు పది పాసయ్యారా అని అడిగాను. 'పాసయ్యాము ఇంటర్లోకూడా చేరాము. ఇంటర్‌ చదవలేమని త్వరలోనే తెలిసిపోయింది. కాలేజీ మానుకొన్నాము. వనుల్లో కుదురుకున్నాము.” అని చెప్పారు. మరి పదెలా పాసయ్యారని అడిగాను.

“ఏమోసార్‌ ఎలా పాసయ్యామో అంటూ సిగ్గుపడుతూ తలలు వంచుకున్నారు. ఆవును. చూని రాశామనీ, వరీళ్షహాల్లో మూకుమ్మడిగా అందరికీ బిట్‌పేపర్లు జవాబులు చెప్పారనే సంగతి ఎలా చెబుతారు. టీచర్లు అధికారులు, ప్రభుత్వమూ కలిసి విల్లల జీవితాలతో ఆడుకుంటుంన్నారనీ, పిల్లల తల్లిదండ్రులను మోసగిస్తున్నారనీ అంటే ఎవరూ ఒప్పుకోరు. పైపెచ్చు పిల్లలకు సహాయం చేసామని చెబుతారు. ఇంక ఎవరు మాత్రం ఏమీ చేయగలరు? సంవత్సరమంతా సిలబస్‌, పాఠాలంటూ (శ్రమపఢడం ఎందుకు? అంతా పరీక్షరోజుల్లో సాయం చేస్తే సరిపోతుంది గదా! నిజంగానే ఇలాగే అనుకొంటున్నారు చాలా మంది.దీనివల్ల చెప్పే టీచర్లకు కూడా ఆసక్తి లేకుందా పోయింది. చదివే పిల్లలు చదవడం మానుకొన్నారు. పదో తరగతి పిల్లలకు సంవత్సరమంతా ఎలా పాసవ్వాలో శిక్షణ ఇస్తూ ఉంటారు. పిల్లలు పది పూర్తిచేసి బయటకు వచ్చి బతాకాల్సి వచ్చినపుడు ఈ పాస్‌లూ మార్కులూ ఎందుకూ పనికిరావు. వాళ్లకు మిగిలేది చదవడమూ, రాయడమూ కాస్తంత గణితమూ. అందుకే ఐన్‌స్టీన్‌ బడిలో సంపాదించిన జ్ఞానాన్ని గురించి ఒక మాట అంటాడు. “బడిలో నేర్చుకొన్నదంతా మరిచిపోయిన తర్వాత ఏదిమిగిలి ఉంటుందో అదే జ్ఞానం అంటాడు. ఇప్పుడు మన పిల్లలకు మిగిలింది ఏమిటి? ఎంతసేపటికీ నూటికి పదిమంది చదివే ఉన్నత చదువుల గురించే ఆలోచిస్తారు. తొంభైమంది సంగతి గాలికి వదిలేశారు.

“సార్‌ ఏమిటి ఆలోచిస్తున్నారు. మాకు మీరేదిక్కు” అంటూ (పాధేయవడసాగారు. శంకర్‌ (వ్రసాద్‌లిద్దరూ. అవనరం వారిదీమరి.“నేను సాయంకాలం వచ్చి మీతో మాట్లాడతాను. మీకు చదువు నేర్చే బాధ్యత తీసుకొంటున్నాను. ధైర్యంగా ఉండండి" అని వారికి భరోసా ఇచ్చాను.

నిటీ బస్సెక్కి కూర్చోగానే అనేక ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. హామీ అయితే ఇచ్చాను గాని ఓపిగ్గా చెప్పగలనా? ఎన్ని రోజులు పడుతుందో? సందేహించాను, భయపడ్డాను. కాని పిల్లల శక్తి సామర్ధ్యాల మీద నాకు అపారమైన నమ్మకముంది. టీచర్‌గా నా సర్వీసు పెరిగే కొలదీ పిల్లలతో అనేక అనుభవాలు పొందాను. ఈ అనుభవాల ఆధారంగా బడిని గురించి పిల్లల చదువుల గురించి నాలో కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి.

1. పిల్లలు బడిలో చదువు నేర్చుకోవడానికీ, నేర్చుకోలేకపోవదానికీ వారి తెలివితేటలకూ ఏ సంబంధమూలేదు.

2. పిల్లలు బడిలో తమశక్తి సామర్ధ్యాలను ప్రదర్శించడానికి ఎలాంటి అవకాశంలేదు. సాధ్యమైనంత వరకూ వాటిని అణచుకొని తమనుతాము అదుపులో పెట్టుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.| తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |