పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అందించనివారిని “చేతులు నరికి చంపడం ద్వారా శిక్షించడం”, “చనిపోయేంతవరకూ నెత్తురు ఓడుతుందేట్లు వదిలివేయడం” జరిగేది అని కొలంబన్‌ కుమారుడు సఫెర్నాందో తన దినచర్యలో భాగంగా రాసుకున్నాడు. హైతీ మరియు డొమినికన్‌ రిపబ్లిక్‌లో సుమారు 10,000 మంది అలా వాంనకు గురయ్యారు. చాలా మందిని కొన్నిసార్లు - సజీవంగా ఉండగానే - “ఇనువ మేకులు తేలిన కట్టెల మీద కాల్చటం”... ఇంకా ఆక్రమణదారులు తమ కత్తుల పదును తేల్చేందుకు “ఆదివాసుల విల్లలను ముక్కలు చేయడం”, ఇంకా, కొలంబస్‌ మనుషులు “ఆదివాసుల పిల్లలను తమ తల్లి రొమ్ము నుండి లాగి కాళ్ళుబట్టి, బండలకేని తలలు బాదడం...”, విల్లల మృతదేవోలను వారి తల్లులపైవేని .. కత్తులతో చీల్చడం జరిగేది, “వారి కత్తుల పదును పరీక్షించడానికి, తన మనుషులను “వారి నుండి వరుగెత్తే పిల్లల కాళ్ళను నరికివేయమని” ఆదేశించేవాడట. అతని సిబ్బంది “ఆదివాసులపై ... మరిగే సబ్బునీళ్లు పోయడం” ఇతరులను “బతికుండగానే పీక్కుతినడానికి, ఆదివాసులపై కుక్కలను ఉసిగొల్ప్బడం”, ఇంకా భయానకమైనదేమంటే తమ వేటకుక్కలకు మాంసం అయిపోతే, “ఆదివాసుల పిల్లలను కుక్కలకు ఆహారం కోసం చంపివేయడం” అంటూ బార్జోలోమ్‌ డి లాస్‌ కాసాస్‌ అనే స్పానిష్‌ చరిత్రకారుడూ కాథలిక్‌ పూజారీ తను నమోదుచేసినట్లు, కొలంబస్‌ దండు జరిపిన మారణహోమానికి సాక్ష్యమిచ్చాడు.

కొలంబస్‌ తోటి నావికుడు, మిగ్యుల్‌ కునియో కూడా ఇలా వ్రాశాడు, “మేము స్పెయిన్‌కు బయలుదేరాల్సి వచ్చినప్పుడు, 1,600 మంది మగ ఆడ రెడ్‌ఇండియన్లను సేకరించాము... ఫిబ్రవరి 17, 1495న... మేము ఈ విషయాన్ని... నావికులలో ఎవరైనా కావాలనుకుంటే ... వారిని అనుభవించవచ్చని తెలియపరిచాం.” కొలంబస్‌, నావికులలో ఒకరికి 16ఏండ్ల కరేబియన్‌ అమ్మాయిని బహుమతిగా ఇచ్చాడు. “ఆమె ప్రతిఘటించినప్పుడు (అతడు) ఆమెను కనికరం లేకుందా కొట్టి ఆమెపై అత్యాచారం చేశాడు”. అత్యాచారాల గురించి మాట్లాడుతూ, యూనివర్శిటీ ఆఫ్‌ వెర్మోంట్‌ చరిత్ర ప్రొఫెసర్‌ దాక్టర్‌ జేమ్స్‌ లోవెన్‌ “14938 యాత్ర కరేబియన్‌కు చేరుకున్న వెంటనే ... కొలంబస్‌ తన లెప్టినెంట్లకు స్థానిక మహిళలను బహుమతిగా ఇస్తున్నాడు. హైతీలో, వారిని సెక్స్‌ బానిసలుగా చేసి ఆనందించేవారు.” ఇందులోని వయోజనులూ పిల్లలూ అత్యాచారానికి గురయ్యేవారు ఉన్నారు. “బాలికలలో ... 9-10 వయసువారికి ... డిమాండ్‌ ఉంది” అని కొలంబస్‌ స్వయంగా 1500 లో వ్రాసినట్లు తెలుస్తోంది”. ఒక రోజున, డి లాస్‌ కాసాస్‌ ప్రత్యక్షసాక్షిగా, కొలంబస్‌ సైనికులు “3,000 మంది స్థానికులను విడదీయడం, శిరచ్చేదం చేయడం లేదా అత్యాచారం చేయడం” చూశానని రాసుకున్నాడు. డిలాస్‌ కాసాస్‌ మాటల్లో “ఈ చర్యలను మానవ స్వభావానికి విరుద్ధమైనవిగానూ పరమ నికృష్టమైన వికృతచేష్టలుగా నా కళ్ళకు అనిపించాయి. ఇప్పుడు నేను వ్రాస్తున్నప్పుడు నేను వణుకుతున్నాను.” అంటూ పేర్మొన్నాడు.

అతి క్రూరమైన పాశవిక మారణకాండను ఎదుర్కొంటున్న ఆరవాక్‌ ఆదివాసులు స్పెయిన్‌ వలసవాదులకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రయత్నించారు. కానీ వారికి యూరోపియన్ల దగ్గర ఉన్న ఆయుధాలూ తుపాకులూ, కత్తులూ ఇతరత్రా ఇంకా గుర్రాలు కలిగిన యుద్ధసంపదతో పోలికే లేదు. బందీలుగా తీసుకున్న రెడ్‌ఇండియన్లను స్పెయిన్‌ వలసవాదులు ఉరితీయడమో లేదా కాల్చివేయడమో చేసేవారు. ఈ పరిస్థితులలో, ఆరవాక్‌ ఆదివాసులు సామూహిక ఆత్మహత్యలు చేసుకోవడం ప్రారంభించారు. వారు తను శిశువులను స్పానిష్‌ వలసవాదుల నుండి కాపాడటానికి కసావాకంద విషాన్ని తినిపించేవారు. రెండేళ్లలో, హైతీలో ఉన్న 2,50,000 మంది ఆదివాసులలో సగం మంది హత్యకు గురవ్వడమో, అంగవైకల్యం పొందడమో లేదా ఆత్మహత్యల ద్వారా చనిపోవడమో జరిగింది. 1550 నాటికి 500 మంది రెడ్‌ఇండియన్లు మైత్రమే మిగిలారు. ఇక 1650 నాటికి, ఆరవాక్‌ ఆదివాసులుగా ప్రపంచానికి పరిచయమైన

రెడ్‌ ఇండియన్లు అమెరికా ఖండం నుంది పూర్తిగా తుడిచిపెట్టబడ్డారు. వారితోబాటే వారి భాషకూడా వలసవాద యూరపుదేశీయుల దాష్టీకానికి బలైపోయింది. ఈ రక్తసిక్త చరిత్ర పునరావృతం కాకూడదంటే వీటిని మననం చేసుకోవడం మనకు తప్పనిసరి. కాలగతిలో వచ్చిన మార్పులను ఆసరాగా తీసుకొని ఈ నేలపై పుట్టిన జాతులపై వారి భాషలపై ప్రపంచీకరణ పేరుతో పరభాషలను రుద్దే ప్రయత్నాలను జాగ్రత్తగా గమనించాలి. గమనించటమేకాదు వాటిని అద్దుకునే ప్రయత్సమూ చేయాలి.

అమ్మతనం

అందాల కలలలోకంలో
ఆదమరిచి విహరించిన ఆ మనసు..!

'ఉదరపు కుడ్యాలను తడుముతున్న
ఆ వెచ్చని పాదాలు..!

(వెన్నులో నుండి పుట్టుకొచ్చిన
నాడులు నాట్యాలు..!

భరించలేని బాధల సుడుల్లో
తనువు పుండైన తరంగాలు...

వారసుని రాకకు సూచికతో..
(దిక్కులు పిక్కటిల్లేలా సంతోషపు కేకలు..!

ఒకవైపు కండరాలన్ని బరువెక్కి

చీకటి ముసిరిన ఆకళ్లల్లో దివ్యతేజస్సులు,
పొత్తిళ్లలో బిడ్డను చూసిన మది
ఆనందతాండవాలు..!

ప్రతి స్త్రీకి ఆ...నవమాసాలు అద్భుత
అనుభూతులకు ఆలవాలమే!

వారసుల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దుతూ
పొందే అనుభవం ఓ అపురూపవరమే!

- అయిత అనిత 89885 348424

| తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |