పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇంగ్లండురాజ్యం విదేశీ వలసలతో ఆస్తుల సంపాదనా వాణిజ్య వ్యాపారాల వ్యవస్థల స్థావనతో మొదలై చరిత్రలోనే కనీవినీ ఎరగని అతిపెద్దదైన బ్రిటీషు సామాజ్యంగా అవతరించింది. 16 వ శతాబ్దంలో చిన్న వలస ప్రాంతంగా ఉత్తర అమెరికాలోని జేమ్స్‌ టౌనుతో మొదలైన అమెరికా వలస విధానం నాలుగు సంవత్సరాలు తిరిగేసరికి ఇంగ్లండు వలసవాదులు అమెరికా ఆదివాసులతో జరిపిన యుద్ధంలో పాస్పెఘా అనే రెడ్‌ఇండియను తెగను నిర్మూలించింది.

ఇలాంటి సందర్భాలను పురస్కరించుకొని, గత సంవత్సరం అక్టోబర్‌ 14న అమెరికా సంయుక్త రాష్ట్రాలలో “కొలంబస్‌ దే” జరుపుకొన్నారు అంటే, జాత్యహంకార మారణహోమానికీ, మన నేలను ఆక్రమించి మనల్ని అనాగరిక బానిసత్వానికి గురిచేసి మన పిల్లలనూ వయోజనులనూ వరుస మానభంగాలకూ ఇంకా శారీరక హింసలకూ గురిచేసి మన భాషలనూ మన సంస్కృతులకూ మరణ శాసనాలు రాసిన నరరూప రాక్షసులకు నాయకత్వం వహించిన కొలంబన్‌ అమెరికా ఖండంలోని ఒక ద్వీపంపై కాలుమోవీన నాటిరోజును ఒక దినోత్సవంగా జరుపుకుంటారా అంటూ దానికి వ్యతిరేకంగా స్థానిక అమెరికన్లు అమెరికా సంయుక్తరాష్ర్రాలలో అనేక నగరాలలో నిరసనలు తెలియజేశారు. కొలంబస్‌ అప్పటికే 100 మిలియన్ల మంది నివసించే అమెరికా ఖండాన్ని కనుగొనలేదు అలా కాదని మేము నిరూపించగలమంటూ ఎన్నో సాక్ష్యాలను చూపారు.

క్రిస్టోఫర్‌ కొలంబస్‌ (1492) రాక ముందు అమెరికాలోని స్థానిక ప్రజల జనాభా సంఖ్యను ఊహించడం కౌంత కష్టమైనా యూరోపియన్‌ వలస నివాసుల నుండి పురావస్తు ఇంకా రాతపూర్వక ఆధారాలతో చాలా మంది వండితులూ మరి కొంతమంది చరిత్రకారులూ - సుమారు 5-10 కోట్లమంది లేక అంతకంటే ఎక్కువ ఉండవచ్చని లెక్కకట్టారు. ఐతే ప్రస్తుతం వారి జనాభా 30 లక్షలు మాత్రమే. అయితే వీరిలో 30% కంటే తక్కువమంది మాత్రమే వారి మాతృభాషలను మాట్లాడగలుగుతున్నారు. అంటే 500 ఏండ్లలో అమెరికా ఆదివాసుల జనాభా పెరుగుదలమాట అటుంచి షుమారు 20 నుంచి 30 వంతుల తరుగుదల కనిపించడం జనాభా గణాంకాల పరిశోధకులకు ప్రశ్నార్థకంగా నిలిచిపోయింది.

అమెరికాలోని స్థానిక వ్రజలు అంటే రెడ్‌ ఇండియన్లు ఐరోపాదేశాలనుంచి వలసవచ్చినవారి వరిచయంతో వారి జనాభా పెరుగుదలలో బలమైన అడ్డంకిని ఎదుర్కొన్నారు అని వరిశోధనలు తెలుపుతున్నాయి. పరిశోధనల ఫలితాలు ఇలా ఉన్నాయి. పురావస్తు, చారిత్రక రికార్డులు యూరోపియన్ల సంపర్మం వల్ల రెడ్‌ఇండియన్ల జనాభాలో విస్తృతమైన మరణాలు సంభవించాయని సూచిస్తున్నాయి. ప్రాచీన-సమకాలీన మైటోకాన్దియల్‌ డిఎన్‌ఎతో అతివిస్తృతమైన సమాచారాన్ని ఉపయోగించి నిర్వహించిన అత్యాధునిక జన్యు అధ్యయనంలో, స్థానిక అమెరికన్ల జనాభా పెరుగుదలలో గణనీయమైన నష్టాన్ని కలిగించిందని సూచిస్తోంది. యూరోపియన్‌ వలసరాజ్యం దేశీయ అమెరికన్లలో యూరోవియన్ల వలసలు విస్తృతమైన మరణాలను ్రేరేపించిందని పేర్కొంది. (ఖైండన్‌ డి. జె ఫలోన్‌ అన్‌ లార్స్‌ ఫె'హైన్‌-శ్శిర్డ్‌, పిఎన్‌. ఏ.ఎస్‌. డిసెంబర్‌ 20, 2011 1ుం:/601.08/ 10. 1073/102. 1112563108) కొలంబస్‌ ఇంకా అతని సహచరులు అమెరికాను న్యూ వరల్డ్‌ అని పిలవడం దుర్మార్గం. వాస్తవానికి, రెడ్‌ఇండియన్లుగా మనం పిలుచుకొంటున్న ప్రజలు, అనగా తయినో, ఆరవాక్‌, లుకాయన్లు, అనే వందలాది అమెరికన్‌ ఆదివాసి తెగలవారు ఈ గద్దపై అప్పటికి 14000 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు.

యూరోపియన్లు అమెరికన్‌ తీరాలను చేరిననాటి నుండి, శ్వేతజాతుల నాగరికతకూ అమెరికా ఖండపు ప్రాకృతిక ప్రపంచంలోని వివిధ తెగలకూ వారి మధ్యనున్న తేడాలు అనేక ఘర్షణలకు దారితీసింది. ఈ ఘర్షణలు ఏదో ఒక చోట కాక అమెరికా అంతటా విన్తరించాయి. ఈ వుర్నణలే అమెరికా నంయుక్తరాష్రాలు రెడ్‌ఇండియన్లపై 1,500 యుద్ధాలూ, దాడులూ జరవడానికీ దారితీసింది. ప్రపంచంలోని ఏ దేశానికైనా దాని స్వంత ప్రజలకు వ్యతిరేకంగా ఇలా చేయడం ఎక్కదా కనబడదు. 19 వ శతాబ్దం చివరలో రెడ్‌ఇండియన్లపై యుద్ధాలు ముగిసే సమయానికి, 2,38,000 కంటే తక్కున మంది రెడ్‌ఇండియన్లు మాత్రమే మిగిలి ఉన్నారు. కొలంబస్‌ 1492 లో మొదటిసారి అమెరికా చేరినప్పటి ఉత్తర అమెరికాలో నివసిస్తున్న రెడ్‌ఇండియన్ల జనాభా (హెన్రీ దోబిన్స్‌, 1966) 1 కోటీ 50 లక్షల నుండి ఇప్పటి జనాభా 25 లక్షలకు గణనీయమైన తరుగుదల కనిపిస్తోంది.

1492 లో కొలంబస్‌ సముద్రమార్గంద్వారా ప్రయాణించి తను భరతఖందానికి సత్వర నముద్రమార్గాన్ని కనుగొన్నట్లు తప్పుడు నమ్మకంతో, నేటి హైతీ - డొమినికన్‌ రిపబ్లిక్‌ లేక ఇస్పానియోలా అని పిలిచే చిన్న ద్వీపాలకు ప్రయాణించి చేరుకున్నాడు. వాస్తవానికి దేశంలోని దేశీయ రెడ్‌ఇండియన్లను సాధారణంగా, “ఇండియన్‌” అని పిలవడానికి ఏకైక కారణం ఏమిటంటే, తను భారతదేశంలో ఉన్నానని పొరపాటుగా భావించటమే. తిరుగుప్రయాణంలో 500మంది రెడ్‌ఇండియన్లను బానిసలుగా అమ్మేందుకు బందీలను చేసి పట్టుకెళ్ళాడు.

స్పానిష్‌ రాజు ఫెర్డినాండ్‌, క్వీన్‌ ఇసాబెల్లా నుండి మరింత ఆర్థిక సహకారం పొందటానికి, తను ఇండియాకు త్వరిత మార్గాన్ని కనుగొన్నట్లు వార్తలతో తిరిగి వచ్చాడు. ఇట్లా 1493, 1498, 1502 లలో ఇండియాగా విలవబడదే ఇప్పటి మధ్య అమెరికాకు మరో మూడు ప్రయాణాలకు ఆయన నిధులు పొందారు.

ఆ సముద్రయానాల ఫలితం, ఆదివాసుల భాషలనూ వారి పురాతన నాగరికతలను నాశనం చేయడంతోపాటు, సుమారు ఎనఖై లక్షల మంది రెడ్‌ఇండియన్లను హత్య చేయడం, లక్షలాది మందిపై అత్యాచారం, హింసించటమేకాక వారు అనుభవిస్తున్న లక్షల ఎకరాల భూమిని దోచుకున్నాడు.

ప్రపంచ చరిత్రలో కొలంబస్‌ అంతటి నికృవ్ణుడూ- నిస్సందేహంగా పరమ రాక్షసుడు అని నిరూపించే తిరస్మరించలేని ఐదు వాస్తవాలు చారిత్రకంగా నమోదు చేయబడిన కథనాలు ఉన్నాయి:

కొలంబస్‌ తన అన్వేషణలో “ఆదివాసులను ఏవిధంగానూ గాయపరచకుండా ఉండాలి అని స్పానిష్‌ రాజు ఫెర్డినాండ్‌, రాణీ ఇసాబెల్లాల ఆదేశాన్ని కొలంబస్‌ విస్మరించినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు, అతను మధ్య అమెరికాలో 1495 లో తనకు రావలసిన వ్యక్తిగత సుంకంగా ఒక “కట్టుబడి” వ్యవస్థను సృష్టించాడు, 14 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తీ ప్రతి మూడు నెలలకూ ఒకసారి “చిరు గంట” అంత బంగారాన్ని అందించాలి. కట్టుబడి అందించినవారికి వారి మెడలో ధరించడానికి “టోకెన్‌” లాంటిది ఇచ్చేవారు. అలా | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |