పుట:అక్షరశిల్పులు.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

2009), 11. ముస్లిం విముక్తి గీతం (2010), 12. కరీముల్లా కవిత్వం (2010). 13. ఇస్లాం వాద వాదోపవాదాలు (సంపాదాకత్వం, వ్యాసాలు, 2010). తొలి ఇస్లాంవాద దీర్ఘకవితగా 'సాయిబు' గుర్తింపు తెచ్చి పెట్టడమే కాకుండా తెలుగు సాహిత్యంలో 'ఇస్లాంవాదం' ఆరంభమై చర్చకు కారణమైంది. అనకాపల్లి ఇండియన్‌ హైకూక్లబ్‌ ఆద్వర్యంలో 'సాయిబు' దీర్ఘ… కవిత కవి స్వీయపఠనంతో ప్రత్యేకంగా తయారైన 'సిడి' విడుదలయ్యింది. అవార్డులు-పురస్కారాలు: జాతీయ కళాలయ విశిష్ట పురస్కారం (పాలకొల్లు, 2008), జాషువా పౌధండేషన్‌ ట్రస్ట్‌ పురస్కారం (1995, హైదారాబాద్‌), ఆనందమయి పురస్కారం (2001, ఒంగోలు), అభినందన సంస్థ ఆవార్డు (1994, తెనాలి), సహృదయ సాహితి అవార్డు (విశాఖపట్నం, 1997), బాపట్ల చిల్డ్రన్‌ ఆర్ట్స్‌ థియేటర్‌ అవార్డు. రాష్ట్ర స్థాయి సాహితీ -సాంస్కృతిక సంస్థలచే సన్మానాలు-సత్కారాలు. లక్ష్యం: ఇస్లాం పట్ల ప్రజలలో కలుగజేస్తున్న అపోహలను తొలగించడం, ముస్లింలను అభ్యున్నతి దిశగా ప్రయాణింప జేసేందుకు తగిన ప్రేరణ కల్గించడం, అన్నిరకాల మతోన్మాదానికి-ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, సామాజిక స్పృహ లక్ష్యంగా ప్రజా చైతన్యానికి దోహదపడడం. చిరునామా: షేక్‌ కరీముల్లా, ఇంటి నం. 21-55, పెద్ద మసీదు బజార్‌, వినుకొండ-522647, గుంటూరు జిల్లా. సంచారవాణి: 94415 02990, Email: karimullakavi2010@gmail.com.

ఖదీర్‌ బాబు మహమ్మద్‌
నెల్లూరు జిల్లా కావలిలో 1972 ఏప్రిల్‌ 28న జననం. తల్లి

తండ్రులు: సర్తాజ్‌, కరీం. చదువు: బిఎస్సీ (కంప్యూటర్స్‌), ఉద్యోగం: 'సాక్షి' దినపత్రిక, హైదారాబాద్‌. 1990 'స్వాతి' వారపత్రికలో 'కళ్యాణి' కథ ప్రచురితం కావడంతో

రచనా వ్యాసంగం ఆరంభం. 1995లో రాసిన 'పుష్పగుచ్ఛం' ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమై గుర్తింపు తెచ్చిపెట్టింది. అప్పటినుండి ప్రచురితమైన కథలలో 'దావత్‌, జమీన్‌, దూద్‌ బఖష్‌, న్యూ బాంబే టైలర్స్‌, ఖాదర్‌ లేడు, పెండెం సోడ సెంటర్‌, ధాకన్‌, కింద నేల ఉంది' కథలు పాఠకుల ప్రశంసలందుకున్నాయి. ఈ కథలలో ఇంగ్లీషులో ఆరు, హిందీలో మూడు, మరాఠిలో రెండు, ఒరియాలో రెండు అనువాదమై ఆయా భాషా పత్రికలలో ప్రముఖంగా చోటుచేసుకున్నాయి. ప్రచురణలు: 1.దార్గా మిట్ట కతలు (1997), 2. పోలేరమ్మ బండ (2004), 3.ఖాదర్‌ లేడు (2003), 4.పుప్పుజాన్‌ కతలు (2005), 5 ధాకన్‌ (2006), 6.మన్‌ చాహె గీత్‌ (2007), 7. కింద నేల ఉంది (2007). 8.గెట్ పబ్లిష్డ్‌ (2010). 'దార్గామిట్ట కతలు' వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి ), సెంట్రల్‌ యూనివర్శిటీ (హైదరాబాదు) లో ఎంఫిల్, పిహచ్‌డిలకు పరిశోధానాంశంగా స్వీకరించారు. 'పోలేరమ్మ బండ' గతకాలపు ఉన్నతపాఠశాల విద్యార్థుల

87