పుట:అక్షరశిల్పులు.pdf/89

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

జీవనాన్ని ప్రతిబింబించిన కథల సంపుటిగా ఆదరణ పొందింది. పిల్లల మౌఖిక కథా సాంప్రదాయాన్ని పట్టుకునే ప్రయత్నం చేసిన సంపుటిగా 'పుప్పుజాన్‌ కతలు' నూతన ఒరవడి సృష్టించింది. 'ఖాదర్‌ లేడు' కథ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పిజీ విద్యార్థులకు పాఠ్యాంశమయ్యింది. 'న్యూ బాంబే టైలర్స్‌' (2000), 'జమీన్‌' (2008) కథలకు 'కథా సంస్థ' రెండుసార్లు జాతీయ అవార్డును ప్రకటించింది. 'ప్రజాతంత్ర' ప్రచురించిన 'సాహిత్య సంచిక'లకు కె.శ్రీనివాస్‌తో కలసి సంపాదాకత్వంవహించారు.'ఇప్పడు వీస్తున్న గాలి' శీర్షికతో 'నిహర్‌ ఆన్‌లైన్‌'లో ఆరవై మంది సాహిత్య కారులను పరిచయం చేశారు. 'మన్‌ చాహెగీత్‌' వనితాటివీలో ప్రసారమైంది. 'సాక్షి' దినపత్రికలో 'బాలివుడ్‌ క్లాసిక్స్‌' పేరిట హిందీ సినిమాల మీద విశ్లేషణాత్మక వ్యాసాలు ప్రచురితం. పురస్కారాలు-అవార్డులు: రావిశాస్త్రి పురస్కారం (రాజమండ్రి, 2005), భాషా సమ్మాన్‌ అవార్డు (మైసూరు, 2006), చాసో అవార్డు (విజయనగరం, 2005), లక్ష్యం: మనుషుల జీవితాల్లోని కష్టసుఖాలను పాఠకుల ఎదుట ఆవిష్కరించి, కథను చిత్తశుద్దితో నడిపి చెప్పాలనుకున్న విషయం పట్ల పాఠకుడిలో చక్కని స్పృహను కల్గించడానికి ప్రయత్నించడం. చిరునామా : మహమ్మద్‌ ఖదీర్‌బాబు, ఇంటి నం.1-13-6, పాతూరు, పురపాలక సంఘం ఉన్నత పాఠశాల ఎదురు, కావలి-524 201, నెల్లూరుజిల్లా, సంచారవాణి: 92900 64047.

ఖాదర్‌ ఖాన్‌ మహమ్మద్‌
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో 1949 జనవరి

నాల్గున జననం. తల్లితండ్రులు: సఫియా బీబి, ఇబ్రహీం ఖాన్‌. కలంపేరు: బాబా. చదువు: బిఎస్సీ. ఉద్యోగం: రాజమండ్రిలో తపాలా శాఖలో పోస్టుమాస్టర్‌గా బాధ్యాతలు నిర్వహిస్తూ ఇటీవల పదవీవిరమణ. చిన్ననాటినుండి సాహిత్యం పట్ల మక్కువ ఉన్నా, 1960 ప్రాంతంలో బాల కవిగా బాలకవుల సమ్మేళనంలో పాల్గొనడం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభమైంది. అప్పటి నుండి కవితలు, కథానికలు, సాహిత్య వ్యాసాలు, సమీక్షలు వివిధ పత్రికలలో ప్రచురితం. ప్రధానంగా హస్యస్పోరక రచనలు చేయడం, ఆయా కార్యక్రమాలలో విస్త్రతంగా పాల్గొనడం పట్ల ప్రత్యేక ఆసక్తి. రచనలు: నాకూమనసున్నది (కవితా సంపుటి). అవార్డులు-పురస్కారాలు: ప్రజాకవి (ప్రజాపత్రిక వారపత్రిక, రాజమండ్రి), కవిరత్న (కళాదర్బార్‌, రాజమండ్రి), హస్య రసాధిరాజు (సాహితీ వేదిక -అనకాపల్లి, హ్యూమర్‌ క్లబ్‌-రాజమండ్రి). లక్ష్యం: పాఠకుల మనస్సులకు బాగన్పించే రచనలు మాత్రమే ఎల్లకాలం చేయాలన్నది. చిరునామా: మహమ్మద్‌ ఖాదర్‌ ఖాన్‌, ఇంటి నం. 86-15-6/10, పవనిక రెసిడన్సీ, ఎస్‌-4, వాడరేవు నగర్, తిలక్‌రోడ్‌, రాజమండ్రి-533 103, తూర్పుగోదావరి జిల్లా. సంచారవాణి: 93902 35789.

88