పుట:అక్షరశిల్పులు.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

చేరని బ్రతుకులు' కవిత ఆంధ్రభూమి పత్రికలో 2000 ఏప్రిల్‌ మాసంలో ప్రచురితం కావడంతో రచనారంగ ప్రవేశం. అప్పటినుండి వివిధ పత్రికలలో, కవితా సంకలనాలలో పలు కవితలు, కథానికలు చోటు చేసుకున్నాయి. ఆకాశవాణి ద్వారా ప్రసారానికి

నోచుకున్నాయి. గుజరాత్‌ గాయం (2000) లో రాసిన కవిత 'చిక్కు ప్రశ్న', ప్రియదత్త వారపత్రికలో (2004) ప్రచురితమైన 'సముద్రం' కథ గుర్తింపు తెచ్చిపెట్టాయి. కథలలో 'మౌనం మాట్లాడింది' ఆకాశవాణి ద్వారా 2009 డిసెంబరులో ప్రసారం అయ్యింది. పలు సన్మానాలు- సత్కారాలు లభించాయి. రచనలు: 1. నిషిద్ధాక్షరాలు (కవితా సంపుటి, 2003), 2. వేకువ కోసం (దీర… కవిత, 2007). నిషిద్ధాక్షరాలు ఖ్యాతి గుర్తింపు తెచ్చి పెట్టింది. లక్ష్యం: ముస్లిం ప్రజానీకం మనోభావాలు, కష్టాలు -కడగండ్లను సమాజం దృష్టికి తేవాలని, అభ్యున్నతి దిశగా ముస్లిం సమాజం ప్రయాణానికి ప్రేరణ ఇచ్చే, మత సామరస్యం, స్నేహభావం పటిష్టపర్చే రచనలు చేయాలని. చిరునామా: పఠాన్‌ కరీముల్లా ఖాన్‌ (నబి.కె.ఖాన్‌), రాయల్‌ సీట్ కవర్‌ వర్క్స్‌, కృష్ణా థియేటర్‌ రోడ్డు, ఇస్లాంపేట, ఒంగోలు-523001, ప్రకాశం జిల్లా. సంచారవాణి: 99859 82292.

కరీముల్లా షేక్‌
గుంటూరు జిల్లా వినుకొండలో 1964 జూన్‌ ఒకిటిన జననం. తల్లి

తండ్రులు: షేక్‌ షంషున్నీసా, షేక్‌ మహబూబ్‌. చదువు: ఎం.ఏ., బి.ఇడి. వృత్తి: ఉపాధ్యాయులు. ప్రవృత్తి: కవిత్వం. విద్యార్థిగా సామాజిక సమస్యల మీద వ్యాసాలు, కవిత్వం రాయడం 1982 నుండి ఆరంభం. ఆ తరువాత రాష్ట్రంలోని వివిధ పత్రికలలో సామాజిక-

ధార్మిక వ్యాసాలు, కవితలు, గేయాలు, సాహిత్య విమర్శనా వ్యాసాలు, కథలు చోటు చేసుకున్నాయి. తెలుగులో ప్రచురితమైన పలు కవితలు ఆంగ్లం, హిందీ భాషలలోకి తర్జుమా చేయబడి ఆయా భాషా పత్రికలలో ప్రముఖంగా ప్రచురితం అయ్యాయి. ఈ కవితల్లో 'దు:ఖలిపి', 'కవాతు', 'సూఫీ కల', 'నిషిధ్దాశ్రువు', 'నా నీడనైనా సరే' మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. రచనలు: 1. ఆయుధాలు మొలుస్తున్నాయి (అభ్యుదయ కవిత్వం, 1998), 2. వినుకొండ చరిత్ర (పరిశోధానాత్మక రచన, 1999), 3. గాయ సముద్రం (కవిత్వం, 1999), 4. 'ధూ' (కవిత్వం, 2002), 5. నా రక్తం కారు చౌక (కవిత్వం, 2002), 6. సాయిబు (ఇస్లాంవాద దీర్ఘ…కవిత, 2004), 7. ఖిబ్లా (సంపాదాకత్వం,ఇస్లాంవాద కవితా సంకలనం, 2006), 8. కవాతు (సంపాదాకత్వం, కవితా సంకలనం, 2007), 9. ఈద్‌ ముబారక్‌ (కవితా సంపుటి, 2009), 10. కొలిమి (సాహితీ వ్యాసాలు,

86