పుట:అక్షరశిల్పులు.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్ష్జరశిల్పులు


కాలేషా షేక్‌
ప్రకాశం జిల్లా కందుకూరులో 1965 ఆగస్టు 18న జననం. తల్లితండ్రులు:

మైమున్నీసా బేగం, అబ్దుల్‌ అజీజ్‌. వృత్తి: జర్నలిజం. కలం

పేరు: మాలిక్‌ , రేష్మా. 1986లో ఆంధ్రప్రబలోవ్యాసం ప్రచురితమైనప్పటినుండి రచనా వ్యాసంగం ఆరంభం. అప్పటి నుండి వివిధ పత్రికలలో, సంకలనాల్లో వ్యాసాలు, కవితలు ప్రచురితం. 'ప్రకాశం ఎస్స్‌ప్రెస్‌' రాజకీయ సామాజిక వారపత్రిక కొంతకాలం నడిపారు. లక్ష్యం: ఆలోచింపజేయు వ్యాసాల ద్వారా ప్రజలలో సామాజిక చైతన్యం కలుగజేయడం. చిరునామా: షేక్‌ కాలేషా, ఇంటి నం. 11-2- 56, సంతోష్‌నగర్‌, ఆర్డీవో కార్యాలయం ఎదుట, కందుకూరు-523105, ప్రకాశం జిల్లా. సంచారవాణి: 99599 43759, 98489 72765, Email: prakasamexpressweekly@ yahoo.com

కమాల్‌ సాహెబ్‌ షేక్‌: కడప జిల్లా రాజుపాలెం మండలం పర్లపాడులో 1948 ఏప్రిల్‌ రండున జససం. తలితండ్రులు: హుస్సేన్‌ బీ, ఫకుద్దీన. జమ్మలమడుగులోని జూనియర్‌ కళాశాలలో తెలుగు పండితులుగా ఉద్యోగం. కవితలు, గేయాలు రాశారు.

కరీం ఖాన్‌ పఠాన్‌: ప్రకాశం జిల్లా మార్కాపురంలో 1973 జనవరి 10న జననం. తల్లి తండ్రులు: ఫాతిమా, పి. ఇస్మాయిల్‌ ఖాన్‌. కలం పేరు: కెకె. చదువు: బి.ఏ. ఉద్యోగం: గీటురాయి వారపత్రిక (హైదరాబాద్‌ ) . 1997 మార్చిలో

గీటురాయిలో వ్యాసంప్రచురితమైనప్పటి నుండి వివిధ పత్రికలలో, సంకలనాలలో కథానికలు, వ్యాసాలు ప్రచురితం. అప్పటినుండి రాసిన వ్యాసాలలో 2005 జూలైలో రాసిన 'కట్నం...కాదు కానుకలు' కథకు గుర్తింపు లభించింది. ఉర్దూలో రాసిన ధార్మిక-సామాజిక వ్యాసాలను తెలుగులోకి అనువదించి ప్రచురణ. లక్ష్యం: ప్రజలలో ఇస్లాం పట్ల ప్రచారంలో ఉన్న అపోహలను దూరం చేయాలని, మూడాచారాల నిర్మూలనకు అవసరమయ్యే చైతన్యం ప్రజానీకంలో కలుగజేయాలన్నది. చిరునామా: పఠాన్‌ కరీం ఖాన్‌, సందేశ భవనం, లక్కడ్‌కోట్, చత్తాబజార్‌, హైదారాబాద్‌ - 500002. సంచారవాణి: 99489 50486, Email: kk_deziner@yahoo.co.in

కరీముల్లా ఖాన్‌ పఠాన్‌
ప్రకాశం జిల్లా ఒంగోలులో 1975 జూన్‌ ఆరున జననం.

తల్లితండ్రులు: సిలార్‌ బి, పఠాన్‌ ఖాన్‌. కలం పేరు: నబి, నబి-కె- ఖాన్‌. చదువు: పదవ తరగతి. వృత్తి: సోఫా వర్క్స్‌. 'మహా ప్రస్థానం' ప్రేరణతో తొలిసారిగా రాసిన 'ఒడ్డుకు

85