పుట:Yenki Paatalu Nanduri Venkata Subba Rao.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిలుక పలుకు

ఎకసకె మెవరికి తెలుసు?
ఎంకిచిలుక మనసు గడుసు!
ఎకసకె ......

'పేరంటముపిలిచి తోట
చూరవిడు తె' యని నేనన_
చిలుకను పరికొలిపి నన్ను
'బలిరాజా'యనిపించిన
ఎకసకె ......
గాయపడిన లేగకు నే
సాయుమిడకె సాగిపోవ_
చిలుకను వుసికొలిపి నన్ను
'శిబిరాజా'యనిపించిన
ఎకసకె ......
కలలో తన సెలవులేకె
కానలబడి పోతినేమొ_
మెలకువగని చిలుక బిలిచి
'నలరాజా'యనిపించిన
ఎకసకె ......
పూలను గద్దియ నమరిచి
పూలకిరీటము కూరిచి
'రాజా'యన తానెకోరు
'రాణీ' తన మనుగొంటిని !
ఎకసకె ......
ఎగతాళియు ఎంతొ సొగసు
ఎంకి చిలుక మనుసె మనసు !
ఎకసకె ......