పుట:Yenki Paatalu Nanduri Venkata Subba Rao.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెర

కరములు సిరులు పరుల కారింపనా?
ఎంకి
కనులెత్తెనా రాజు గతులెరుగునా ?
'నారాజు కగుశయ్య
రేరాజు చేరె'నని
శయ్య సదురును యెంకి
చంద్రుగని కనులార్చు! కరములు సిరులు...
పానుపున మాజోటి
పవళింపు భావించు
వెచ్చ వెచ్చని పాన్పు
వే విధుల లాలించు ! కరములు సిలురు...
తనను వెన్నెల సోక
తప్పువలె కోపించు
'రాజుపస గనురాజు
రాడ?' యని తలయూచు ! కరములు సిరులు...
నేరాక తనతరలు
నారాక గని మరలు
కళ్ళలో చందురుని
కైదుగొని నిదురించు ! కరములు సిరులు...
దూరాల దొర, పై నిగారాల రాజు కీ
కరములు సిరులు పరుల గారింపనా
ఎంకి
కనులెత్తెనా రాజె గతులెరుగునా ?

-----------------

యెంకి పాటలు 91