పుట:VrukshaSastramu.djvu/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

85

యెడల చాల లాభము వచ్చును. ఆవాలలో వణన్ ఆవాలు పెద్దఆవాలు మూడు గొల్లు ఆవాలు, తెల్లఆవాలు, మొదలగు తెగలుగలవు. వీనిలో మొదటి తెగయే శ్రేస్టము. తెల్ల ఆవాలౌషదమునందే కాని పోపులలో వాడము. అవాల నుండి పిండి చేసి యమ్ముదురు. ఇట్టిపిండి ఐరోపాదేశము లందుండి కూడ వచ్చు చున్నది. మనదేశపు పిండికంటే నిదియే శ్రేష్టమందురు. భోజన మెక్కసమై బాధ చెందుచుండిన గాని, త్రాగి పడియుండిన గాని దీనిని కొంచెము దినినచో వాంతియై కడుపులోని మలినముపోయి బాధ తగ్గును. అన్నముతో బాటీ పిండిని కొన్ని దినములు తినినయెడల జీర్ణ శక్తి కలిగి ఆకలి పుట్టును. కొన్నినొప్పులకు నావపిండిని పట్టువేసెదరు.

ముల్లంగి
... మన దేశములో జాల చోట్ల బెరుగును గాని మన మంతగా వాడమిచే దాని సేద్యము తక్కువగానున్నది. వర్షములకు ముందర నేలను బాగు చేసి, కొన్ని వానలు కురియునప్పుడు గింజలను జల్లెదరు. తరువాత వారానికి 6 దినముల కొక సారి తడి తగులుచుండవలెను. ఒక మాసము లోనే దుంపలెదిగి త్రవ్వుటకు సిద్ధముగా నుండును. దుంపలకు నాకులకు నొక విధమగు వాసన కలదు కాని కొందరు దుంపలు ఆకులు కాయలు కూడ కూర వండుకొనెదరు. ఇది