పుట:VrukshaSastramu.djvu/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

51

గుంజేల యుండవలయును, మామిడి చెట్టుగాని, టెంకగాని ఎన్నడును ఆగుంజును దినుట లేదే, ఆచెట్టు ఎందుకిట్టి యనవసరమగు శ్రమ పడవలయునని యొకప్పుడైన మన కాశ్చర్యముగ దోచక పోదు. కాని యాలోచించి చూచినతో మనకు మిక్కిలి మనోహరముగ నుండు పండ్లును గాచుటకు కారణము మనపై ఆచెట్టులకు గల అవ్వ్యాజానురాగము కాదనియు తన స్వంత లాభమునకే యట్లు చేయు చున్నదనియు దెలియ వచ్చుచున్నది. మిక్కిలి రుచియగు రసమీ పండ్లనుండి లభించు చున్నది. కనుక మనకు పండ్లు సమృద్ధిగ దొరుకుటకు వాని టెంకలనతి శ్రద్ధతో బాతి, మొక్కలను కాపాడు చున్నాము. మామిడి చెట్ల నెక్కువగ నాటుచున్నాము. ఇదియె మామిడి చెట్టు గోరునది. తన తెగ పెరుగుటయే దానికి కావలసినది. ఇదివరకు చెప్పినట్లు ప్రతి ప్రాణి యొక్కముఖ్యోద్దెశమును ఇట్టిదే. తమవారిని అభివృద్ధి చేయ నెంచు చుండును. మామిడి చెట్లేల నెక్కువ చేయుచున్నాము. కనుక మనకు బ్రత్యుపకారముగ తియ్యని రసము నిచ్చుచున్నదని యూహింప వచ్చును. లేదా ఆచెట్టు లంచమిచ్చుచున్నదని తలప వచ్చును. గుమ్మడి, దోస, వంగ, మొదలగు కండ గలిగిన కాయలను గాచు చెట్లన్నియు నీతీరున మనకో, ఇతర జీవులకో లంచ మిచ్చి వ్వాప్తిని చెందుచున్నవి.