పుట:VrukshaSastramu.djvu/497

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

494

వర్గము
- పుష్పరహితము, వంశము: అవయవ అరహితము ఉప వంశము (శేవతము)

నీటిపాచి

నీటి పాచి మంచి నీళ్ళలోనే గాక ఉప్పు నీళ్ళలోను సముద్రముల లోను కూడ నుండును. ఈ పాచిలో కంటికి కాన రాని యొక్కొక కణముగానె యున్న మొక్కలును వందల కొలది అడుగుల పొడుగున్నవియు గలవు. ఎంత పొడుగు ఎంత వెడల్పున్నను నవి కణముల సముదాయమె గాని వానిలో ఆరు కొమ్మవేరు అనుభేదము లేమియు లేవు. ఈ లక్షణములో బూజును పోలి యున్నవి. విడివిడిగా నుండు కొన్ని కణములకు నత్తల మీద గుల్లయున్నట్లు గుల్ల కలదు. ఆగుల్లలోనే మూల పదార్థముండును. అది పూర్తిగ నెదిగిన పిదప మూల పదారథము పైకి వచ్చు గుల్ల నుండి విడిపోయి రెండు తునకలుగా నగును. ఒక్కొక తునకకు తిరిగి గుల్ల ఏర్పడును. అవియు మొదటి దాని వలెనే పెరుగును. లేదా, గుల్లలో నుండగనే రెండు గా విడును. ఆగుల్ల రెండు ఆలు చిప్పలు గలిసి యున్నట్లు ఉన్నది. కావున ఒక్కొక్క భాగము నంటి ఒక్కొక చిప్ప బోవును, తరువాత వానికి రెండవ చిప్ప వచ్చును. ఈవచ్చెడు రెండవ చిప్ప మొదటి దాని కంటె చిన్నదిగా నుండును. ఈ రీతి