పుట:VrukshaSastramu.djvu/494

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

491

కొన్నినీళ్ళలోనే యుండును. చెట్లకువేరులున్నట్లు వీనికిని వేరులు వంటివి గలవు. ఇవియు ఆకులును, అన్ని వేరులు ఆకులు చేయునట్లే, ఆ యా పనులు చేయు చున్నవి. వేరు ప్రకాండముల అంతర్భాగముల నిర్మాణ్ము వేరు వేరు పర్ర్ణములందు వేరు వేరు విధములు గ నున్నది. పర్ణముల వంటివి యితర మొక్కలు కొన్ని గలవు. వీనిలోను మరి యొక విధమున నున్నది. ఎందులోను పువ్వులు పూసెడు చెట్లలోనున్నట్లులేదు.

చెట్లలో సంతానవృద్ధికి కారణమగు సంగములు పుష్పములని దెలిసి కొంటిమి. కాని వీనిలో పుష్పములు లేవు. కాన సిద్ధి బీజములు గలుగు చున్నవి. పర్ణములలో సిద్ద భీజాశయములు ఆకులు కడుగు వైపున అంచు వద్ద పొక్కులు పొక్కులుగ్తా నున్నవి. అవి పెరుగు చోట, కొంచెము గోదుమ వర్ణముగా చేతి కంటుకొను పొడియే సిద్ధ బీజములు. పర్ణముల వంటి మరియొక మొక్కలోనివి ఆకుల మీద బుట్టుట లేదు. చిన్న చిన్నకొమ్మలు కొంచెమెత్తుగా బెరిగి గద వలె నగు చున్నవి. వీని మీదస్నున్న ఆకుల కణుపు సందులలో అవి పెరుగు చున్నవి.

ఆడు, మగ, సిద్ధబీజములలో పరిమాణము తప్ప పైకగుపించు భేదమేమియు లేదు. ఆడుసిద్ధ బీజములు పెద్దవి. ఈ