పుట:VrukshaSastramu.djvu/474

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

470

జొన్నలు కొందరు అన్నౌ వండుకొని తిందురు. వానానినరిగించుట కొనుట కష్టము. వాని ఆకులు, కాడలు పశువులకు బలము నిచ్చును. వీనిలో నాలుగైదు తెగలు గలవు.

తెల్ల జొన్నలు, పచ్చజొన్నలు, ఎర్రజొన్నలు అను బేధములు గలవు.

గడ్డి జొన్నలు ఇసుక నేలలో ఒకటి, రెండు అడుగులెత్తు పెరుగును గాని మిక్కిలి సారవంతమైన చోట్ల పది, పదునైదడుగులెత్తు కూడ పెరుగును. వీని కణుపుల వద్ద వేళ్ళు పారును. ఆకులు నున్నగనే యుండును గాని అంచులు మాత్రము గరుకుగా నుండును.

పెద్దచోళ్ళ కాడలు నిడువుగాను, బల్ల పరుపు గాను రెండు మొదలై దడుగు లెత్తు వరకు పెరుగును. ఆకులు కాడకు రెండు వైపులనే యుండును. చోళ్ళ కంకులు వంగి యుండును. కాని పెద్ద చోళ్ళ కంకులు వంగి యుండవు. ఇవి అంత కంటె ఎత్తుగా నుండును. వీణి గింజలును పరువుగా నుండును. వీని పంటకు అప్పుడప్పుడు నీరు తగులు చుండ వలెను గాని చేనులో నిలకడగా నుండ రాదు. నూతులు, చెరువుల ఆధారమున్నచో నెప్పుడైనను పంట పండింప వచ్చును. గాలి లేనిచో వర్షకాలము వ