పుట:VrukshaSastramu.djvu/457

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

453

అండకోశము
అండాశయౌ 1 గది. 1 అండము. పీఠసంయోగము ఫలము లేదు. కీలాగ్రము నల్లగా నుండును. కొన్ని అండకోశములు గొడ్డులయి యున్నవి.

ఈ కుటుంబపు మొక్కలలో కొన్ని చిన్నవి. కొన్ని పెద్దవి. కొన్ని తీగలు కొన్ని బురుద నేలలో పెరుగును. ఆకులు ఒంటరి చేరిక. వీని పుష్పములను బట్టి ఈ కుటుంబపు మొక్కలను గుర్తింప వచ్చును. వాని కంకులు మొక్కజొన్న పొత్తుల వలె నుండును. సంపూర్ణ పుష్పములు లేవు. అండ కోశము ఉచ్చము.

చేమదుంపలు మన దేశములో ఎల్ల చోట్లను సేద్యము సేయు చున్నారు. ఒండ్రు మట్టితో కూడిన ఇసుక నేలలో బాగుగ పెరుగును. బాగుగ ఎదిగిన దుంపల తలలు కోసి పాతి పెట్టుదురు. ఆతలల నుండి 5, 6 మొక్కలు మొల్చును. వానికి దరుచుగా నీరును పెంటయు దగులు చుండ వలెను. ఆకులు కాక దుంపలకై వీనిని సేద్యము చేయు చుండిన అడుగు దూరములో పాతి మూడో నాలుగో ముదురాకులుంచి లేత వానిని త్రుంపి వేయ వలెను. పదినెలల నాటికి దుంప లెదుగును.

చేమదుంపలతో కూరను మాత్రము వండు కొను చున్నాము. వేసవి కాలమందు, వంగ, బీర, పొట్ల మొదలగు