పుట:VrukshaSastramu.djvu/458

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

454

కాయలు దొరకనప్పుడివి సమృద్ధిగను కుళ్ళి పోకుండనునుండుటచే మిక్కిలి యుపయోగ కరములగుచున్నవి . చేమదుంపలలో కొన్ని గుండ్రముగాను, కొన్ని కోలగాను నుండును. కోల దుంపలు బాగుగ ఉడుకునందురు. చేమ దుంపల యందును గంద వలె దురద పెట్టు పదార్థము గలదు. చేమ దుంపల నుడక పెట్టిన నది పోవును. మరియు నేదైన పుల్లని పదార్థము గీనితో గలసిన ఆ పదార్థము చెడు గుణము పోవును. కనుక దరుచుగా చింత పండు పులుసునో, నిమ్మకాయల రసమునో కలుపుచుందురు. వీని ఆకుల తోడసు కూర వండు కొందురు.

కంద మొక్కయని మనమనుకొనునది నిజముగా ఆకులే. మానుగాదు. మానుభూమిలో దాగి కంద వలె మారినది. కందసు కూడ చేమ వలెనే సేద్యముచేయుదురు. దీనికి నల్లనేల మంచిది. దీని యందు దురదపెట్టు పదార్థము చాలగలసు. క్షీరాభ్ధి ద్వాదశికి నుసిరి మొక్కను పూజ చేసినట్లు మహాళాయమావాశ్యకు కంద మొక్కను పూజింతురు.

వస మొక్క పువ్వులలో రేకులున్నవి. వీని ఆకుల నుండి తైలముతీయుదురు. దీనివేరును అజీర్ణము, దగ్గు మొదలగు రోగములకు దగుననుపానములతో నిత్తురు.