పుట:VrukshaSastramu.djvu/453

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

449

పేవబెత్తములు కూడ నీకుటుంబములోనివె. అవి అడవులలో చెట్ల మీద తీగెల వలె ప్రాకును. వాని పొడుగున ఆకులు దూరదూరమున నుండును. పేవ బెత్తములలో జాల తెగలు గలవు. కొన్నిలావుగ నుండును. కొన్నిసన్నముగా నుండును. కొన్ని విస్తారము పొడుగుగ నుండును. వీనితో కుర్చీలు, చేతి కర్రలు, చాపలు, బుట్తలు మొదలగునవి చేయుదురు. పేప బెత్తములను కోయగనే వానినుండి పలుచనిద్రవముగారును. ఈ ద్రవమునుండి అరపూస వంటి పదార్థము చేయుదురు. బెత్తములు సన్నముగాను పొడుగుగాను నుండి ఎటైనను వంగు చుండుట చేత త్రాడువలె నవి ఉపయోగించును. ఇవి త్రాడునకంటె ఎక్కువ బరువునాపును.

జీలుగ చెట్టు అరువది అడుగులెత్తు పెరుగును. పువ్వులకంకిమీద రెండు మగ పువ్వుల మద్యనొక ఆడు పుష్పముండును. జీలుగమాను గట్టిగా నుండి కలప వలె ఉపయోగించును. దాని నుండి మంచినారయు దీయ వచ్చును. ఈ నారతో జేయు పగ్గములు ఏనుగులనైన కట్టుటకు సరిపోవునంత గట్టిగా నుండును. ఈ చెట్లును కూడ గీసి కల్లు తీయుదురు. దీనినుండియు బెల్లము చేయుచున్నారు. మాను మధ్యనున్న దవ్వలో నుండి సగ్గుబియ్యమును వండుదురు. స